‘కరోనా వైరస్ కాదు.. జంతువులను కాపాడే అవతారం..’

Coronavirus : కరోనా.. వైరస్ కాదని, జంతువులను కాపాడేందుకు దిగివచ్చిన అవతారం అని వ్యాఖ్యానించాడో స్వామీజీ. అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి ఈ వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: February 17, 2020, 7:34 PM IST
‘కరోనా వైరస్ కాదు.. జంతువులను కాపాడే అవతారం..’
కరోనా వైరస్
  • Share this:
Coronavirus: ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వైరస్ ఇది. ఇప్పటికే దాదాపు 1700 మందిని పొట్టనపెట్టుకున్న ఈ మహమ్మారి వేలాది మంది ప్రాణాలను బలి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీని ప్రభావంతో చైనా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. ప్రపంచ దేశాలు వణికిపోయాయి. కోట్ల మంది ప్రాణాలు పోతాయని భయపడ్డాయి. ప్రమాదాన్ని వెంటనే పసిగట్టి ప్రపంచ దేశాలు తగిన చర్యలు తీసుకున్నాయి. అయితే, కరోనా.. వైరస్ కాదని, జంతువులను కాపాడేందుకు దిగివచ్చిన అవతారం అని వ్యాఖ్యానించాడో స్వామీజీ. అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కరోనా.. వైరస్ కాదు. మూగ జీవాలను కాపాడేందుకు వచ్చిన అవతారం. వాటిని తినే వారిని దండించేందుకు, ప్రాణ భయం చెప్పేందుకు వచ్చాయి.’ అని వ్యాఖ్యానించారు.
స్వామి చక్రపాణి

వీలైతే కరోనా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయాలని, జంతువులను మరోసారి చంపబోమని క్షమాపణ కోరాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు హితబోధ చేశారు. మూగ జీవాలకు హాని తలపెట్టబోమని ప్రతిజ్ఞ చేస్తే కరోనా తన లోకానికి వెళ్లిపోతుందని అన్నారు.

First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు