హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఆగ్రాలో వ్యాక్సినేషన్ క్యాంప్ ..స్మశానంలో ఎందుకు పెట్టారో తెలుసా..?

ఆగ్రాలో వ్యాక్సినేషన్ క్యాంప్ ..స్మశానంలో ఎందుకు పెట్టారో తెలుసా..?

Photo credit: youtube

Photo credit: youtube

AGRA:గుర్తింపు కార్డులు ఉంటేనే మనుషులుగా భావిస్తున్నారు ఆగ్రాలోని వైద్యశాఖ అధికారులు. స్మశానం పరిసరాల్లో దిక్కుమొక్కులేని వందలాది మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం మరిచారు. ఇదేంటని ఓ సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి ప్రశ్నించడంతో చివరకు స్మశానంలోనే వ్యాక్సినేషన్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసి టీకాలు వేశారు.

ఇంకా చదవండి ...

కరోనా(Corona) మరోసారి దండయాత్ర చేయడం మొదలుపెట్టింది. ఒమిక్రాన్‌ (Omicron)రాష్ట్రాలపై విరుచుకుపడుతోంది. మరి ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యశాఖ వ్యాక్సినేషన్‌ క్యాంప్‌(Vaccination camp)లు ఏర్పాటు చేసి టీకాలు ఇస్తోంది. అయితే చాలా ప్రాంతాల్లో ఈ వ్యాక్సినేషన్‌ క్యాంప్‌లను ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (Community health centre)ల దగ్గర ఏర్పాటు చేసి ఎవరూ వైరస్‌ (Virus)బారినపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఆగ్రా(Agra)లో మాత్రం అలా జరగలేదు. వ్యాక్సినేషన్ క్యాంప్‌ను ఏకంగా స్మశానంలో ఏర్పాటు చేశారు. అదేంటి అక్కడ మృతదేహాలు, సమాధులు ఉంటాయి కదా వాటికి వ్యాక్సిన్ వేస్తున్నారా ఏంటీ అని ప్రశ్నించకండి. ఎందుంకంటే ఆ చుట్టు పక్కల కూడా వందల కుటుంబాలు కాపురం ఉంటున్నాయి. దేశంలో చాలా ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్లు బిచ్చగాళ్లు, చెత్త ఏరుకునే వాళ్లు(Ragpickers),చిల్లర వ్యాపారాలు చేసుకొని జీవనం పొందుతున్న వాళ్లంతా ఆగ్రాలోని స్మశానం పక్కనే ఉంటున్నారు. వాళ్లకు కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతుందనే విషయం తెలియదు. కనీసం వ్యాక్సిన్ తీసుకోవాలన్న అవగాహన లేదు. స్మశానం పరిసరాల్లో ఉంటున్న ఇలాంటి వాళ్లను ఆగ్రా(Agra)లోని ఆరోగ్యశాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.

స్మశానంలో వ్యాక్సినేషన్‌ క్యాంప్..

అలాంటి వాళ్లను కూడా కరోనా బారిన పడకుండా చూడాల్సిన బాధ్యతను అధికారులకు గుర్తు చేశాడో వ్యక్తి. బాలల హక్కుల సంఘం కార్యకర్త అయినటువంటి నరేష్‌ పరాస్‌ అనే మహానుభావుడు..ఇలాంటి దిక్కు, మొక్కులేని వాళ్లకు వ్యాక్సిన్ ఇవ్వండి మహాప్రభో అని అధికారుల్ని వేడుకున్నాడు. అంతటితో ఆగకుండా స్మశానం సమీపంలో కాపురం ఉంటున్న వందలాది మందికి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాడు. అక్కడి వాళ్లందని వ్యాక్సిన్ తీసుకునేలా ఒప్పించాడు. ఎవరి దగ్గర ఆధార్‌ కార్డులు, పాన్‌ కార్డులు లేకపోవడంతో అధికారులు వారికి టీకాలు ఇచ్చేందుకు ముందు కొంత ఆలోచించారు. ఆ తర్వాత వ్యాక్సినేషన్‌ క్యాంప్‌ను స్మశానంలోనే ఏర్పాటు చేశారు.

ముందు వ్యాక్సిన్ ఇవ్వాల్సింది వాళ్లకే..

స్మశానం అంటే చనిపోయిన వాళ్లను తెచ్చి ఖననం చేయడం లేదా దహనం చేసే ప్రదేశం. అలాంటి చోటికి ఎంతో మంది రోగాలు , వ్యాధులతో మృతి చెందిన వాళ్ల డెడ్‌బాడీలు వస్తుంటాయి. వాటి వెంట వందలాది మంది వచ్చి దహన సంస్కారాలు, సమాధి చేస్తుంటారు. అంతటి ప్రమాదకరమైన ప్రాంతాల్లో నివసిస్తున్న వందలాది కుటుంబాలకు వ్యాక్సిన్ ఇవ్వకుండా వదిలేస్తే ఎలా అన్నది నరేష్‌ పరాస్‌ అభిప్రాయం. అలాంటి వాళ్ల నుంచే సామాజిక వ్యాప్తి ద్వారా వైరస్‌ మరికొంత మందికి చేరుకునే అవకాశం ఉంటుందని నరేష్‌ పరాస్‌ వాదన. ఇంత చెప్పినప్పటికి అధికారులు స్మశానం పరిసరాల్లో ఉంటున్న వాళ్ల కోసం వ్యాక్సినేషన్‌ క్యాంప్‌ను స్మశానంలో ఏర్పాటు చేయడం విశేషం.

Published by:Siva Nanduri
First published:

Tags: Agra, Coroana cases, Corona alert

ఉత్తమ కథలు