గార్డెన్‌లో దొరికిన రెండో ప్రపంచ యుద్ధం నాటి పేలని బాంబు...

Corona Lockdown | Corona Update : అది బాంబు అని తెలియక ఆమె... ఆడుకోమని కుక్క కోసం విసిరేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: May 4, 2020, 12:22 PM IST
గార్డెన్‌లో దొరికిన రెండో ప్రపంచ యుద్ధం నాటి పేలని బాంబు...
గార్డెన్‌లో దొరికిన రెండో ప్రపంచ యుద్ధం నాటి పేలని బాంబు... (credit - FB)
  • Share this:
Corona Lockdown | Corona Update : బ్రిటన్‌లో లులు సిరిల్లో అనే మహిళ గార్డెన్‌లో మొక్కలు నాటుదామని గోతులు తవ్వడం మొదలుపెట్టింది. మధ్యలో టంగ్ మని శబ్దం వచ్చింది. అక్కడ ఏ రాయో ఉంది అనుకుంటూ... తవ్వింది. తీరా చూస్తే... అదేదో ఇపున ముద్దలా ఉంది. భూమిలో 10 అంగుళాల లోపల ఉంది. దాన్ని బయటకు తీసింది. అప్పుడే ఆమె పెంపుడు కుక్క సికా ఆమె దగ్గరకు వచ్చింది. సరే కుక్కను ఆడిద్దాం అనుకొని... ఆ ముద్దను (బాంబును... కాస్త దూరానికి విసిరింది. అదేదో ఎముక ముక్కలా ఫీలైపోయిన కుక్క... తోక ఊపుకుంటూ..,. వెళ్లి ఆ ముద్దను తీసుకొచ్చి... ఆమె పక్కన పెట్టింది. ఆమె మళ్లీ విసరడం, కుక్క మళ్లీ తేవడం... ఇలా కాసేపు ఈ ఆట సాగింది.

Lockdown3, Corona Warrior, extend the lockdown, corona update, coronavirus outbreak, coronavirus lockdown, coronaupdate, fight with corona virus, covid19, కరోనా లాక్‌డౌన్, కరోనా అప్‌డేట్, కరోనా న్యూస్,
గార్డెన్‌లో దొరికిన రెండో ప్రపంచ యుద్ధం నాటి పేలని బాంబు... (credit - FB)


ఆ తర్వాత ఆ ముద్దను (బాంబును)... ఇంట్లోకి తీసుకెళ్లిన ఆమె... అసలేంటి ఇది... అనుకుంటూ దాన్ని బాగా కడిగింది. అప్పటికీ అదేంటో ఆమెకు అర్థం కాలేదు. దాన్ని ఫొటో తీసి... ఫేస్‌బుక్‌లో షేర్ చేసి... ఇదేంటి అని అడిగింది. అది బాంబు అని తెలిసి... షాకు మీద షాకైంది.

ఆమెకూ, కుక్కకూ అదృష్టం రాసి పెట్టి ఉందనుకోవచ్చు. ఎందుకంటే... ఆ బాంబు ఇంకా పేలలేదు. కానీ... ఇప్పటికీ అది పేలేందుకు అనుకూలంగా ఉందని తేలింది. ఎలాగంటే... ఫేస్‌బుక్‌లో ఒకరు అది రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబు అని చెప్పారు. వెంటనే ఆమె... విషయం పోలీసులకు కాల్ చేసి చెప్పింది. వెంటనే బాంబు డిస్పోజల్ టీమ్ ఆ ఇంటికి వచ్చింది.

బాంబును భద్రంగా తీసుకెళ్లి... వేమౌత్ బీచ్‌లో... దాన్ని పూర్తి రక్షణ మధ్య పేల్చివేసింది. దాన్ని పేల్చుతూ... ఆ వీడియోని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడే ఆ బాంబు అలా పేలిందంటే... 60 ఏళ్ల కిందట అది ఎంత భారీగా పేలి ఉండేదో.

బాంబు పేలిన వీడియో చూసిన లులు సిరిల్లో... "వామ్మో... భలే పేలిందిగా... దానితో నేనూ, నా కుక్క ఆడుకున్నాం... అప్పుడు గానీ పేలి వుంటే మా పరిస్థితేంటి" అని ఆశ్చర్యంలో మునిగిపోయింది.
First published: May 4, 2020, 12:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading