కిమ్ పని అయిపోయిందా? కిమ్ చెల్లెలు అధినేత్రి కాబోతున్నారా? ఎవరామె?

North Korea | Corona Lockdown | Corona Update : ప్రపంచమంతా కరోనా కలకలం ఉంటే... ఉత్తర కొరియాలో మాత్రం కిమ్ యో జోంగ్ కలకలం రేపుతున్నారు.

news18-telugu
Updated: May 3, 2020, 8:35 AM IST
కిమ్ పని అయిపోయిందా? కిమ్ చెల్లెలు అధినేత్రి కాబోతున్నారా? ఎవరామె?
కిమ్, ఆయన చెల్లి (credit - twitter - deniz)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ బతికేవున్నారనీ, ఆరోగ్యంగా ఉన్నారని తేలడంతో... ప్రపంచ మీడియా కొత్త ప్రశ్న వేస్తోంది. అంతా బాగానే ఉంటే... కిమ్ చేయాల్సిన పనులను ఆయన చెల్లి అయిన కిమ్ యో జోంగ్ ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో అసలు ఆమె ఎవరన్న కొత్త ప్రశ్న ఉదయించింది. మహిళలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వని నియంత పాలనలో... ఉదయిస్తున్న ఆ మహిళ ఎవరన్నది ఆసక్తిగా మారింది. ప్రపంచ మీడియాతోపాటూ... భారత మీడియా కూడా ఈ అంశంపై ఎక్కువ ఫోకస్ పెట్టడంతో... కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

కిమ్ యో జోంగ్ ఎవరు?

- కిమ్ జోంగ్ ఉన్ గురించి ఎలాగైతే పూర్తి వివరాలు ఎవరికీ తెలియవో... అలాగే ఆయన చెల్లి మేటర్ కూడా. ఇద్దరూ సొంత అన్నా, చెల్లే. ఇద్దరి తల్లిదండ్రులూ ఒకరే.
- కిమ్ లాగానే ఆమె కూడా స్విట్జర్లాండ్‌లోనే చదువుకున్నారు.
- 2011లో కిమ్ తండ్రి చనిపోయిన తర్వాత నుంచి... కిమ్‌కి తోడుగా ఉంటున్నారు. ఇటీవల ఉత్తరకొరియా రాజకీయాల్లో ఆమె ఎక్కువగా కనిపిస్తున్నారు. కిమ్‌తో చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
- ప్రస్తుతం కిమ్ ఎక్కడికి వెళ్లాలి, ఏ కార్యక్రమాల్లో పాల్గొనాలి అనే అంశాలపై షెడ్యూల్ నిర్ణయించేదీ, ప్రిపేర్ చేస్తున్నదీ ఆయన చెల్లే.
- 2014లో కిమ్‌కి తీవ్ర అనారోగ్యం వచ్చినప్పుడు... కొంతకాలం ఉత్తర కొరియా అధ్యక్షురాలిగా కిమ్ యో జోంగ్ బాధ్యతలు చేపట్టారు.- 2017లో ఉత్తర కొరియా అధికార కమ్యూనిస్ట్ పార్టీలోని కీలక విభాగానికి ఆమెను పొలిట్ బ్యూరో సభ్యుురాలిగా ప్రమోట్ చేశారు.
- 2018లో దక్షిణ కొరియాలో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌కి కిమ్... తన బదులుగా... తన చెల్లెలిని పంపించాడు.
- ఇలా దక్షిణ కొరియాకు... కిమ్ వారసత్వం నుంచి ఒకరు వెళ్లడం ఇదే తొలిసారి.
- 2018 ఏప్రిల్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో కిమ్ చర్చలు జరిపినప్పుడు... కిమ్ యో జోంగ్ తన అన్నయ్యకు తోడుగా చర్చల్లో పాల్గొన్నారు.
- ఆనాటి చర్చల్లో దేశాధి నేతలు చర్చించేందుకు కూర్చునే ఓవల్ టేబుల్ దగ్గర ఉత్తర, దక్షిణ కొరియా అధినేతల పక్కన కిమ్ యో జోంగ్ కూడా కూర్చున్నారు.
- 2020 ఏప్రిల్‌లో మరోసారి పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఆమెను కిమ్ ఎంపిక చేశాడు. తద్వారా ఉత్తర కొరియా పాలనా వారసత్వంలో ఆమెకు సుస్థిర స్థానం లభించేలా చేశాడు.

కిమ్ తర్వాత కిమ్ యో జోంగ్ బాధ్యతలు చేపడతారా :
ఇందులో ఎలాంటి అనుమానమూ అక్కర్లేదు. కిమ్ విపరీతంగా స్మోకింగ్ చేస్తాడు. విస్కీ తెగ తాగుతాడు. అందువల్ల తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయి. అందువల్లే ఆల్రెడీ వారసురాలిగా ఆమెను రెడీ చేస్తున్నాడు. కిమ్‌కి సొంత పిల్లలు ఉన్నా... వారు అప్పుడే పాలనా పగ్గాలు చేపట్టేంత వయసు వారికి లేదు. అందుకే తెరపైకి కిమ్ యో జోంగ్ వచ్చారని తెలుస్తోంది.

మహిళను ఎదగనిస్తారా :
నిజమే. ఉత్తరకొరియాలో మహిళలకు చాలా చిన్నచూపు ఉంది. వాళ్లను వంటింటికే పరిమితం చేస్తున్నారు. పురుషులకు ప్రభుత్వమే ఉద్యోగాలు ఇస్తోంది. మహిళలకు అక్కడక్కడా ప్రైవేట్ మార్కెట్లలో ఉపాధి కల్పిస్తోంది. అలాంటి చోట... ఓ మహిళ అధినేత అయితే ప్రపంచానికి మంచిదే. ఇది ఎప్పుడు జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం.
First published: May 3, 2020, 8:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading