అలిగిన పిల్లి... ఓదార్చిన కుక్క... వైరల్ వీడియో...

Corona Lockdown | Corona Update : ఆ ఇంట్లో కుక్కలు ఫ్యామిలీ ఫొటో తీయించుకోవాలనుకున్నాయి. అలిగిన ఆ పిల్లి... ఆ ఫొటోలో ఉండేందుకు ఇష్టపడలేదు.

news18-telugu
Updated: May 10, 2020, 8:32 AM IST
అలిగిన పిల్లి... ఓదార్చిన కుక్క... వైరల్ వీడియో...
అలిగిన పిల్లి... ఓదార్చిన కుక్క... వైరల్ వీడియో... (credit - twitter - madeyousmile)
  • Share this:
Corona Lockdown | Corona Update : కుక్కలు, పిల్లులకు పడదని మనకు తెలుసు. కొన్ని సందర్భాల్లో మాత్రం అవి కలిసి జీవించగలవు. అలాంటి ఓ సందర్భంలో... మూడు కుక్కలు ఫ్యామిలీ ఫొటో తీయించుకోవాలనుకున్నాయి. మూడు కుక్కలూ కెమెరాకు పోజ్ ఇచ్చాయి. అయితే... అదే ఇంట్లో ఓ పిల్లి కూడా ఉంటోంది. దానికి మూడ్ బాలేదు. కానీ... ఆ కుక్కల్లో ఒకటి... పిల్లిని కూడా వచ్చి... ఫ్యామిలీ పోర్ట్రయిట్‌కి పోజ్ ఇవ్వమంది. కానీ ఆ పిల్లికి ఇష్టం లేదు. మీరు తీయించుకోండి... నేనెందుకూ అన్నట్లు ముఖం పెట్టింది. "భలేదానివే... నువ్వు లేకపోతే ఎలా... నువ్వూ మా ఫ్యామిలీయే" అంటూ... ఆ పిల్లిని తీసుకొచ్చి... కెమెరా ముందు నిలబెట్టింది కుక్క. ఈ అనుబంధాల అరుదైన వీడియో... ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.




మేడ్ యు స్మైల్ ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియో ఉంది. గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్కలు, పిల్లుల మధ్య జరిగిన నాటకీయ పరిణామాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. షర్ట్స్ వేసుకొని టైలు కట్టుకొని... చక్కగా ముస్తాబైన కుక్కలు... తమ ఇంట్లోనే ఉంటున్న యాంగ్టీ పిల్లి బుంగమూతి పెట్టడం చూసి నొచ్చుకున్నాయి. సరిగ్గా ఫొటో తీసే సమయానికి పిల్లి తనకు వద్దన్నట్లు వెళ్లిపోతుంటే... దాన్ని ఆపేందుకు కుక్క చేసిన ప్రయత్నం... అందర్నీ ఆకట్టుకుంటోంది. జాతి వైరం మరచి అవి అంత అన్యోన్యంగా ఉండటాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: May 10, 2020, 8:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading