ప్రజలను దూరం జరగమంటున్న కుక్క... వైరల్ వీడియో..

Corona Lockdown | Corona Update : సింగపూర్‌లో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి పెరగడంతో... ప్రభుత్వం రోబో డాగ్స్‌ని రంగంలోకి దింపింది.

news18-telugu
Updated: May 9, 2020, 2:20 PM IST
ప్రజలను దూరం జరగమంటున్న కుక్క... వైరల్ వీడియో..
ప్రజలను దూరం జరగమంటున్న కుక్క... వైరల్ వీడియో.. (credit - twitter - reuters)
  • Share this:
Corona Lockdown | Corona Update : కుక్కలు ఎంత విశ్వాసమైనవో.... రోబో డాగ్స్ కూడా అంతే విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాయి. ప్రపంచంలో కరోనా వైరస్ వచ్చాక... చాలా దేశాలు రోబోల సేవల్ని తెగ వాడేసుకుంటున్నాయి. కరోనా తగ్గినట్లే తగ్గి... మళ్లీ పెరుగుతున్న సింగపూర్‌లో కూడా రోబోల వాడకం పెరిగింది. ప్రస్తుతం సింగపూర్‌లో 22460 కరోనా కేసులుండగా... రోజూ కొత్తగా... 700కు పైగా కేసులొస్తున్నాయి. మొత్తం మరణాలు మాత్రం 20 దగ్గరే ఉన్నాయి. కారణం... సింగపూర్ ప్రభుత్వం... కరోనాపై గట్టిగానే పోరాడింది. కొన్నాళ్ల తర్వాత... వెసులుబాట్లు కల్పించింది. దాంతో... మళ్లీ కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. ఇక ఏం చెయ్యాలా అని ఆలోచించి... రోబోల సేవలు తీసుకుంటోంది.

ఇప్పుడు మనం చూస్తున్నది రోబోడాగ్. కుక్కలకు ఏ లక్షణాలు ఉంటాయో... అవన్నీ దీనికీ ఉంటాయి. అచ్చం కుక్కలాగే ఇది ప్రవర్తిస్తుంది. మనుషులంటే విపరీతమైన అభిమానం చూపిస్తుంది. ఐతే... దీనికి ఇచ్చిన డ్యూటీ ఏంటంటే... పార్కుల్లో తిరిగేవారు, ఆడుకునేవారు, సైక్లింగ్ చేసేవారు... ఎవరైనా సరే సోషల్ డిస్టాన్స్ పాటించేలా చెయ్యాలి. ఇందుకోసం ఈ కుక్క రోజంతా పార్కులో తిరుగుతూ ప్రజల్ని గమనిస్తూ ఉంటుంది. ఎవరైనా దగ్గరకు చేరుతున్నారంటే చాలు... వెంటనే అక్కడకు వెళ్లి... "ప్లీజ్ ప్లీజ్ దూరం జరగరా... ఇంకాస్త... ఇంకాస్త" అంటూ పొలైట్‌గా బతిమలాడుతుంది. ఓ రోబో డాగ్ అలా అడుగుతుంటే... ఎవరికైనా ముచ్చటేసి... ఆటోమేటిక్‌గా జరగరూ.ఈ కుక్కను బోస్టన్ డైనమిక్స్ కంపెనీ తయారుచేసింది. శుక్రవారం దీన్ని సెంట్రల్ పార్కులో ఏర్పాటుచేశారు. రెండు వారాల పాటూ ట్రయల్ రన్ నడిపిస్తారు. ఇది బాగానే పనిచేస్తుందని అనుకుంటే... అప్పుడు ఇలాంటి వందల కుక్కల్ని తెప్పించి... సింగపూర్‌ అంతటా నిఘా కోసం పెట్టేయాలన్నది ప్రభుత్వ ప్లాన్‌గా తెలుస్తోంది.ఈ కుక్క పేరు స్పాట్ (SPOT). ఇది కుక్క లాగా మొరగదు. "దూరంగా ఉండండి... సింగపూర్‌ని ఆరోగ్యంగా ఉంచండి" అని ఇది ఇంగ్లీష్‌లో లేడీ వాయిస్‌లో చెబుతుంది. "మీరు ఆరోగ్యంగా ఉంటూ... ఇతరుల్ని ఆరోగ్యంగా ఉంచండి" అని సూచిస్తుంది. రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే స్పాట్... ఎత్తు ఎక్కగలదు, దిగగలదు. దీనికి ప్రత్యేక కెమెరా కూడా ఉంది. దానితో... పార్కులో ఎంత మంది ఉన్నారో షూట్ చేసి... తన టెక్నికల్ నిపుణులకు ఫొటోలు పంపిస్తుంది.

రోబోడాగ్స్‌ని ప్రస్తుతం సింగపూర్‌లోని కొన్ని ఆస్పత్రుల్లో పేషెంట్లకు మందులు ఇవ్వడానికి కూడా ట్రయల్స్‌గా వాడుతున్నారు. కారు ఆకారంలో ఉండే మరో రోబోను... ఓ రిజర్వాయర్ దగ్గర పెట్టారు. అది అక్కడ జనం గుమికూడకుండా చేస్తోంది.
Published by: Krishna Kumar N
First published: May 9, 2020, 2:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading