బైక్‌పై వచ్చి పాపను కిడ్నాప్ చెయ్యబోయిన కోతి... వైరల్ వీడియో...

Corona Lockdown | Corona Update : కోతి బైక్‌పై రావడం ఓ విచిత్రం, పాపను కిడ్నాప్ చెయ్యబోవడం మరో విచిత్రం... ఇది ఎలా జరిగింది?

news18-telugu
Updated: May 5, 2020, 11:24 AM IST
బైక్‌పై వచ్చి పాపను కిడ్నాప్ చెయ్యబోయిన కోతి... వైరల్ వీడియో...
బైక్‌పై వచ్చి పాపను కిడ్నాప్ చెయ్యబోయిన కోతి... వైరల్ వీడియో... (credit - YT - tony)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఈ షాకింగ్ వీడియోలో... ఓ కోతి... ఓ బొమ్మ బైకుపై వేగంగా వచ్చి... ఓ చిన్నారిని కిడ్నాప్ చెయ్యడానికి ప్రయత్నించడంతో... ఈ వీడియో వైరల్ అయ్యింది. ఖాళీగా ఉన్న ఆ వీధిలో... ఓ ఇంటి ముగ్గురు పిల్లలు, ఓ పసిపాప అరుగు బయట బెంచీపై కూర్చున్నారు. ఇంతలో ఓ కోతి... బొమ్మ బైక్ వేసుకొని... ఆ ఇంటివైపు వేగంగా వచ్చింది. అలా వస్తూ వస్తూ... ఇంటి దగ్గరికి రాగానే... బైక్‌ని ఒక్కసారిగా వదిలేసింది. దాంతో... బైక్ వెళ్లి బెంచీకి తగిలింది. పిల్లలు ఉలిక్కిపడ్డారు. ఓ పసి పాపను బెంచీ నుంచి కింద పడేసిన కోతి... ఆ పాప డ్రెస్ పట్టుకొని బరబరా ఈడ్చుకుపోసాగింది. ఇంతలో పిల్లల అరుపులు విని ఇంట్లో పెద్దవాళ్లు బయటకు వచ్చి... కోతి అలా ఈడ్చుకుపోవడం చూసి ఆశ్చర్యపోయారు. అప్పటికే ఆ కోతి 8 అడుగుల దూరం పాపను లాక్కుపోయింది.


లక్కీగా అందరూ అరవడంతో... భయపడి ఆ కోతి పాపను వదిలేసి పారిపోయింది. ఈ వీడియో తీసిన వ్యక్తి కూడా ఇంటి పై నుంచి అరవడంతో... పాపకు ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత ఏడుస్తున్న పాపను ఎత్తుకొని తల్లి ఓదార్చింది. ఇదంతా జరిగింది ఇండియాలో కాదు. ఇండొనేసియాలోని తంజుగ్సారీ గ్రామంలో.

ఈ వీడియో వైరల్ అయ్యింది. మొదట ఈ ఇందులో బైకుపై కోతి రావడాన్ని ఫన్నీగా ఫీలవుతున్న నెటిజన్లు... ఆ తర్వాత కోతి చేసిన పనికి ఆవేదన చెందుతున్నారు. పొరపాటున ఆ ఇంటి సభ్యులు లేటుగా వచ్చి ఉంటే... ఆ కోతి వల్ల పాప చనిపోయేదే అంటున్నారు కొందరు.

ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగి ఉండొచ్చనే అనుమానం కలుగుతోంది. ఆ కోతికి ఎవరో బొమ్మ బైక్ నడపడం అలవాటు చేశారనీ... అలాగే పిల్లల్ని ఎత్తుకుపోవడం కూడా అలవాటు చేశారనీ... కిడ్నాప్ ప్లాన్‌ను కోతి ద్వారా అమలు చేయించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
First published: May 5, 2020, 11:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading