ఫేస్ మాస్క్ పెట్టుకొని... భూమివైపు వస్తున్న భారీ గ్రహశకలం...

Corona Lockdown | Corona Update : ఓ భారీ గ్రహశకలం భూమివైపు వస్తోంది. అది భూమిని ఢీకొట్టే అవకాశాలు లేకపోయినా... దాని గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.

news18-telugu
Updated: April 26, 2020, 8:28 AM IST
ఫేస్ మాస్క్ పెట్టుకొని... భూమివైపు వస్తున్న భారీ గ్రహశకలం...
ఫేస్ మాస్క్ పెట్టుకొని... భూమివైపు వస్తున్న భారీ గ్రహశకలం... (credit - twitter - Evan Kirstel #StayHome #RemoteWork)
  • Share this:
Corona Lockdown | Corona Update : గ్రహశకలాలు భూమివైపు రావడం, పోవడం సహజమే. రోజూ చిన్నా పెద్దా నాలుగైదు గ్రహశకలాలు వస్తూనే ఉంటాయి. తాజాగా 1.5 కిలోమీటర్ల పొడవున్న ఓ గ్రహశకలం భూమివైపు వస్తోంది. ప్యూర్టోరికోలోని అరెసిబో అబ్జర్వేటరీ... ఆ గ్రహశకలాన్ని ఫొటో తీసింది. తీరా ఆ ఫొటోను చూస్తే... గ్రహశకలం (Asteroid)... ముఖానికి N-95 మాస్క్ ధరించినట్లుగా ఉంది. అంతే... ఇప్పుడా ఫొటో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉంది కదా... మనుషులమైన మనం సోషల్ డిస్టాన్స్ పాటిస్తున్నాం. అలాగే భూమివైపు వస్తోంది కాబట్టి.. ఆ గ్రహశకలం కూడా ఫేస్ మాస్క్ పెట్టుకుందని జోక్స్ వేస్తున్నారు.


ఈ గ్రహశకలం ఎవరెస్ట్ పర్వతంలో సగం సైజు ఉంటుంది. అయినప్పటికీ అది కరోనాను చూసి భయపడుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


దీనికి 52768 (1998 OR2) అనే పేరుంది. ఎందుకంటే... ఇది తొలిసారిగా 1998లో కనిపించింది. ఇది ఏప్రిల్ 29న భూమికి దగ్గరగా వస్తుంది. అయితే... దగ్గరగా వచ్చిన సమయంలో... ఇది భూమికి 39 లక్షల మైళ్ల దూరంలో ఉంటుంది. అంటే... భూమి, చందమామ మధ్య ఎంత దూరం ఉందో... అంతకు 16 రెట్లు ఎక్కువ దూరం ఉంటుందన్నమాట. అందువల్ల అది భూమిని ఢీకొట్టే అవకాశాలే లేవు.
Published by: Krishna Kumar N
First published: April 26, 2020, 8:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading