మూలపడేసిన లాటరీ టికెట్‌కి బంపర్ ప్రైజ్... రూ.41.50 కోట్లు గెలుచుకున్న ముగ్గురు భారతీయులు...

Corona Lockdown | Corona Update : కొంతమంది అదృష్టాన్ని నమ్ముకుంటారు. అది అరుదైన సందర్భాల్లో కొంత మంది జీవితాల్ని మార్చేస్తుంది.

news18-telugu
Updated: May 5, 2020, 7:45 AM IST
మూలపడేసిన లాటరీ టికెట్‌కి బంపర్ ప్రైజ్... రూ.41.50 కోట్లు గెలుచుకున్న ముగ్గురు భారతీయులు...
మూలపడేసిన లాటరీ టికెట్‌కి బంపర్ ప్రైజ్... రూ.41.50 కోట్లు గెలుచుకున్న ముగ్గురు భారతీయులు... (File)
  • Share this:
Corona Lockdown | Corona Update : మొన్నటివరకూ వాళ్లు సామాన్యులు. ఇప్పుడు కోటీశ్వరు. అదృష్ట దేవత వాళ్లను వెతుక్కుంటూ వచ్చి వరించింది. కేరళకు చెందిన ఆ ముగ్గురూ... కొన్ని నెలలుగా.... అబూదాబిలోని రస్ అల్ ఖైమాలో నడుపుతున్న ఆటో గ్యారేజీని త్వరలో మూసేయాలని అనుకున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా... వారి బిజినెస్ అడ్డంగా పడిపోయింది. దిక్కుతోచని పరిస్థితుల్లో... భవిష్యత్తేంటో తెలియని టెన్షన్ మధ్య... వాళ్లు అబూదాబిలో... లాటరీ టికెట్ ద్వారా.... ఫస్ట్ ప్రైజ్ మనీ రూ.41.50 కోట్లు కొట్టేశారు. దీనిపై అక్కడ టాక్స్ కూడా లేదు. మొత్తం డబ్బు చేతికొస్తుంది. ఒక్కసారిగా వారి జీవితం మారిపోయినట్లే.

ఉత్తర కేరళలోని కన్నూర్‌కి చెందిన జిజేష్ కోర్త్... తన భార్య, కూతురితో రస్ అల్ ఖైమాలో 15 ఏళ్లుగా ఉంటున్నాడు. కొన్ని నెలల కిందట ఆ లాటరీ టికెట్ కొన్నాడు. దాన్ని ఒక్కడే కొనేంత డబ్బు లేకపోవడంతో... తన ఫ్రెండ్సైన షన్నోజ్, షాజెహాన్ దగ్గర కూడా డబ్బు తీసుకొని కొన్నాడు. లాటరీ గెలిస్తే... డబ్బు ఎలా పంచుకోవాలన్నదానిపై వాళ్లు ఎలాంటి డీలూ చేసుకోలేదు. ఎందుకంటే... గెలుస్తామన్న నమ్మకం వారికి లేదు. అందుకే ఆ లాటరీ టికెట్‌ను ఇంట్లో ఓ మూల అలా వదిలేశాడు. ఆ తర్వాత దాన్ని పూర్తిగా మర్చిపోయాడు.

తాజాగా అబూదాబిలో లాటరీ డ్రా తీశారు. ఆ విషయం కూడా జిజేష్‌కి తెలియదు. లాటరీ సంస్థకు చెందిన ఒకరు... జిజేష్‌కి కాల్ చేసి కంగ్రాట్స్... మీరు ఫస్ట్ ప్రైజ్ మనీ గెలుచుకున్నారు అని చెప్పారు. జిజేష్‌ నమ్మలేదు. అసలు ఆ లాటరీ టికెట్ ఉందో లేదో కూడా తెలియదన్నాడు. వాళ్లు వెంటనే... ఆ టికెన్ వెతికి... దానిపై నంబర్ చెక్ చేసుకోండి అని కాల్ కట్ చేశారు.

ఆ తర్వాత... ఇంట్లో వెతగ్గా... అరలో ఓ మూల... నలిగిపోయిన టికెట్ కనిపించింది. దానిపై నంబర్ 041779 అని ఉంది. తనకు కాల్ చేసిన వ్యక్తి వాట్సాప్‌లో పంపిన నంబర్ సరిచూసుకున్నాడు. రెండూ సేమ్ నంబర్లు. అంతే... ఎగిరిగంతేశాడు. ఆ సమయంలో అతనితో ఉన్న భార్య, ఏడేళ్ల కూతురు కూడా ఎంతో ఆనందపడ్డారు.

జిజేష్... లాటరీ డబ్బును తన ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి... సమానంగా పంచుకుంటామని తెలిపాడు. ఆ డబ్బుతో... తమ వ్యాపారాల్ని పెంచుకుంటామని చెప్పాడు. లాటరీ గెలవడం ఓ అద్భుతం అన్న జిజేష్... ఇక తన కుటుంబం, తన ఫ్రెండ్స్ కుటుంబాల కష్టాలు తీరినట్లే అంటూ ఆనందం వ్యక్తం చేశాడు.
First published: May 5, 2020, 7:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading