సీసీకెమెరాకి చిక్కిన చిరుత ...కొనసాగుతున్న గాలింపు

హైదరాబాద్... రాజేంద్రనగర్‌లో ఓ లారీ క్లీనర్‌ కాలు కొరికేద్దామని ట్రై చేసిన చిరుతపులి... ఆ తర్వాత ఏమైందన్నది ప్రశ్నగా మారింది. హిమాయత్ సాగర్ దగ్గర చిరుత నీళ్లు తాగుతుండగా... స్థానికులు చూశారు. ఆ విషయాన్ని అధికారులకు చెప్పారు. దాంతో అధికారులు అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేశారు. కానీ వాళ్లకు చిరుత కనిపించలేదు.

Corona Lockdown | Corona Update : వెళ్లిపోయింది అనుకున్న చిరుతపులి వెళ్లలేదని అర్థమైంది. దాని కోసం అధికారులు వెతుకుతున్నారు.

  • Share this:
    హైదరాబాద్ :  రాజేంద్రనగర్‌లో హల్‌చల్ చేసి ఎటో వెళ్లిపోయిన చిరుతపులి... మళ్లీ ఇప్పుడు కనిపించింది. హిమాయత్ సాగర్ దగ్గర చిరుత నీళ్లు తాగుతుండగా స్థానికులు చూశారు.మొదట అది కుక్క అనుకున్నారు. కాసేపు అలా చూడగా దాని ఒంటిపై మచ్చలు చూసి అమ్మో అది చిరుతపులే బాబోయ్. అంటూ ఎవరికి వాళ్లు ఇళ్లలోకి పారిపోయారు. నీళ్లు తాగిన చిరుతపులి చిరాగ్గా మొహం పెట్టి అక్కడి నుంచి ఎటో వెళ్లిపోయింది. అది ఎటు వెళ్లిందో, ఎక్కడికి వెళ్లిందో తమకు తెలియదని అంటున్నారు స్థానికులు. మీరు అది వెళ్తున్నప్పుడు చూడలేదా... అంటే... అది తమకు చాలా దూరంలోనే ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం చిరుత కోసం హిమాయత్ సాగర్‌లో అటవీ అధికారులు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ముందు రోజు రాజేంద్రనగర్‌లోకి ఎంటరైన చిరుతపులి రోడ్లపై పరుగులు పెట్టి రోజంతా ప్రజలకు టెన్షన్ తెప్పించింది. చివరకు అక్కడి ఓ ఫామ్‌హౌజ్‌లోకి వెళ్లింది.ఫామ్‌హౌస్ తర్వాత అటు నుంచి ఎటో వెళ్లిపోయిందని అధికారులు అనుకున్నారు. అది హిమాయత్ సాగర్ వైపు వెళ్లిందని ఇప్పుడు తెలియడంతో దాని కోసం 16 బృందాలు గాలిస్తున్నాయి.

    Published by:Venu Gopal
    First published: