నార్త్ కొరియా రిసార్ట్ దగ్గర కిమ్ జోంగ్ ఉన్ ట్రైన్... ఎందుకు ఉంది?

Kim Jong Un | Corona Lockdown | Corona Update : ఉత్తర కొరియా నియంత ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు వస్తున్న వేళ... ఓ ట్రైన్ ఫొటో కలకలం రేపుతోంది.

news18-telugu
Updated: April 26, 2020, 9:01 AM IST
నార్త్ కొరియా రిసార్ట్ దగ్గర కిమ్ జోంగ్ ఉన్ ట్రైన్... ఎందుకు ఉంది?
నార్త్ కొరియా రిసార్ట్ దగ్గర కిమ్ జోంగ్ ఉన్ ట్రైన్... ఎందుకు ఉంది? (credit - reuters)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కి చెందిన రైలుగా చెప్పుకునే ఓ ట్రైన్... ఉత్తర కొరియాలోని రిసార్ట్ టౌన్‌లో వాన్సాన్ ఎలైట్ రైల్వే స్టేషన్ దగ్గర  కనిపించింది. శాటిలైట్ ఫొటోల ద్వారా అది ఆ ట్రైనే కావచ్చని చెబుతోంది అమెరికా... వాషింగ్టన్‌లోని నార్త్ కొరియా మానిటరింగ్ ప్రాజెక్ట్. ఓవైపు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు వస్తున్న వేళ... ఈ ట్రైన్ ఫొటో కలకలం రేపుతోంది. ఈ మానిటరింగ్ ప్రాజెక్టును 38 నార్త్ అని పిలుస్తారు. రిసార్ట్ టౌన్ అనేది... వాన్సాన్‌లో ఉంది. ఏప్రిల్ 21 నుంచి 23 మధ్య ఈ ట్రైన్... రిసార్ట్ టౌన్ స్టేషన్‌లో కనిపించినట్లు 38 నార్త్ చెబుతోంది. సాధారణంగా కిమ్, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఈ ట్రైన్‌ని ఉపయోగిస్తారు.

ఆ ట్రైన్ కిమ్ దేనా? (credit - google maps)


వాన్సాన్‌లో ఉన్నది ఆ ట్రైనే అని మానిటరింగ్ ప్రాజెక్టు 38 నార్త్ చెబుతోందని ఓ కథనాన్ని ప్రచురించిన రాయిటర్స్ వార్తా సంస్థ... దీనిపై స్పష్టత ఇవ్వలేదు. ఆ ట్రైన్ వాన్సాన్‌లో ఉందంటే... దానర్థం... కిమ్ జోంగ్ ఉన్ అక్కడ ఉన్నట్లే అన్నది 38 నార్త్ చెబుతున్న మాట.

ట్రైన్ ఉన్నంత మాత్రాన కిమ్ అక్కడే ఉన్నాడని చెప్పలేమంటున్నారు కొందరు. ఉత్తర కొరియా తూర్పు తీరంలో ఈ వాన్సాన్ ఉంది. ఇక్కడ కిమ్‌కి అత్యంత ఎక్కువ భద్రత, రక్షణ ఉంటుంది. అందువల్ల ఆయన ఇక్కడే ఉండి ఉంటాడనే అనుమానాలు కలుగుతున్నాయి.

రెండు వారాలుగా కిమ్ ప్రపంచానికి కనిపించట్లేదు. ఆయనకు హార్ట్ సర్జరీ చేసిన తర్వాత... ఆరోగ్యం విషమించిందనే వార్తలొస్తున్నాయి. కొందరైతే... కిమ్ చనిపోయాడని కూడా అంటున్నారు. ఏ వార్తలోనూ నిర్ధారణ లేదు. అన్నీ ఊహలే. ఐతే... ఏప్రిల్ 15న తన తాత, కొరియా జాతిపిత... రెండో కిమ్ సంగ్ జయంతి వేడుకలకు కిమ్ జోంగ్ ఉన్ రాలేదు. అలాగే... శనివారం నార్త్ కొరియా మిలిటరీ ఫౌండేషన్ డేకి కూడా రాలేదు. అందువల్ల ఆయన ఆరోగ్యం బాలేదన్న వాదన బలంగా వినిపిస్తోంది.

ఉత్తర కొరియా నుంచి ఏ వార్త బయటకు రావాలన్నా... కిమ్ పర్మిషన్ తప్పనిసరి. మన ఇండియాలో లాగా... అక్కడ మీడియా ఉండదు. కిమ్ చెప్పిందే వేదం, చేసేదే శాసనం. అందువల్ల ఆయన ఆరోగ్యం ఎలా ఉందన్నది ప్రపంచానికి తెలియట్లేదు.
Published by: Krishna Kumar N
First published: April 26, 2020, 9:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading