ఇంటి పైకప్పులో ఇరుక్కున్న కోబ్రా... కాపాడిన అధికారులు... వైరల్ వీడియో...

Corona Lockdown | Corona Update : అసలే కరోనా వైరస్‌తో టెన్షన్ పడుతున్న ప్రజలకు ఈ వన్య ప్రాణుల సమస్యలు ఎక్కువవుతున్నాయి.

news18-telugu
Updated: May 23, 2020, 11:22 AM IST
ఇంటి పైకప్పులో ఇరుక్కున్న కోబ్రా... కాపాడిన అధికారులు... వైరల్ వీడియో...
ఇంటి పైకప్పులో ఇరుక్కున్న కోబ్రా... కాపాడిన అధికారులు... వైరల్ వీడియో... (credit - twitter)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఇది గోవాలో జరిగిన ఘటన. అక్కడి కోటిగావ్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీలో... ఓ కోబ్రా... ఇంటిపైకి వెళ్లి... పైకప్పులో దూరింది. అక్కడ ఇరుక్కుపోయింది. వెనక్కి వెళ్లలేక, ముందుకి వెళ్లలేక... అక్కడే ఊగిసలాడుతుంటే... సిబ్బంది చూశారు. మొదట పాము డాన్స్ చేస్తోందేమో అనుకున్నారు. తర్వాత అది డాన్స్ కాదనీ... ఇరుక్కుపోయిందనీ అర్థమైంది. వెంటనే అక్కడికి దగ్గర్లోనే ఉన్న అటవీ అధికారులకు చెప్పారు. అధికారులు ఉన్నారు గానీ... వాళ్ల దగ్గర పామును కంట్రోల్ చేసే పరికరాలు లేవు. అసలు వాళ్లకు పాముల్ని పట్టుకోవడం కూడా తెలియది. కానీ పాము పరిస్థితి చూశాక... దాన్ని వెంటనే కాపాడాలని ఫిక్స్ అయ్యారు. నానా తంటాలు పడి ఓ అధికారి ఇంటి పైకి ఎక్కి... ఉత్తి చేతులతోనే పామును పట్టుకొని... మరో చేత్తో కర్రను పట్టుకొని... దాన్ని కంట్రోల్ చేస్తూ కాపాడారు.


కోబ్రా (నాగుపాము) అనేది విషపూరితమైన పాము. అలాంటి దాన్ని ప్రాణాలకు తెగించి కాపాడారు అధికారులు. అందుకే ఈ వీడియో వైరల్ అయ్యింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (IFS) అధికారి శైలేంద్ర సింగ్... ట్విట్టర్‌లో ఈ వీడియోని పోస్ట్ చేశారు. అది ఏ ఏనుగో, సింహమో, పులో అయితే... అటవీ అధికారులు కంట్రోల్ చెయ్యగలరన్న శైలేంద్ర... పామును కూడా ప్రాణాలకు తెగించి కాపాడటం గొప్ప విషయం అని మెచ్చుకున్నారు.నెటిజన్లు కూడా ఈ వీడియోని చూసి... వన్యప్రాణులకు అధికారులు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో గుర్తించి మెచ్చుకుంటున్నారు. పామును కాపాడిన ఆ అధికారి... దాన్ని ఓ సంచిలోకి పోనిచ్చారు. తర్వాత అడవిలో వదిలేశారు.

గత వారం ఇలాగే... అరిజోనాలో ఓ ప్రెగ్నెంట్ మహిళ... సూపర్ మార్కెట్‌లో సామాన్లు కొనుక్కొని ఇంటికి వెళ్లసాగింది. మధ్యలో రోడ్డుపై 6 అడుగుల పాము కనిపించింది. కారు ఆపి దాన్ని మొబైల్‌లో ఫొటో తీసింది. తిరిగి వెళ్లిపోబోతుంటే... అటుగా అదే రోడ్డుపై మరో కారు రావడం చూసింది. ఆ కారు ఈ పామును తొక్కేస్తుందేమో అని భావించి... వెంటనే ఆ పామును పట్టుకొని.. అడవిలో వదిలేసింది. అది విషపూరితమైన పాము కాదని ఆమెకు తెలుసు. ఆ వీడియో వైరల్ అవ్వడం, ఆమెను అందరూ మెచ్చుకోవడం అన్నీ జరిగాయి.

First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading