కుక్కతో హైడ్ అండ్ సీక్ ఆడుతున్న చిన్నారి... వైరల్ వీడియో...

Corona Lockdown | Corona Update : లాక్‌డౌన్‌లో ఎవరితో ఆడుకోవాలన్నది పెద్ద సమస్య. ఆ పిల్ల కుక్కను ఎంచుకుంది.

news18-telugu
Updated: May 10, 2020, 2:15 PM IST
కుక్కతో హైడ్ అండ్ సీక్ ఆడుతున్న చిన్నారి... వైరల్ వీడియో...
కుక్కతో హైడ్ అండ్ సీక్ ఆడుతున్న చిన్నారి... వైరల్ వీడియో... (credit - Insta - gsdfriend)
  • Share this:
Corona Lockdown | Corona Update : కరోనా లాక్‌డౌన్ సమయంలో... మన తెలుగు రాష్ట్రాల్లో ఇరుగు పొరుగు వారితో పేకాటలు ఆడి... కరోనా పాజిటివ్ తెచ్చుకున్న వాళ్లను చూశాం. ఈ రోజుల్లో ఎవరి ఇళ్లలో వాళ్లే ఆడుకోవాల్సిన పరిస్థితి. పక్కింటి పిల్లలతో ఆడుకునే స్వేచ్ఛ కూడా లేని కాలం. ఆ చిన్నారికి కూడా ఎలా ఆడుకోవాలో, ఎవరితో ఆడుకోవాలో అర్థం కాలేదు. అందుకే... తెలివిగా తన కుక్కతో దాగుడుమూతలు ఆడాలని డిసైడ్ అయ్యింది. మనుషులైతే... కళ్లు మూసుకొని... ఓ పది లెక్క పెట్టగలరు. ఆది డాగ్ కదా... దానికి ఇవన్నీ ఎలా తెలుస్తాయి అని అనుకోవాల్సిన పని లేదు. అది కూడా ఆట నేర్చేసుకుంది. స్టార్ట్ అనగానే... గోడ వైపు తల తిప్పి... కాళ్లు అనించి... నంబర్లు లెక్కపెట్టకుండా కాసేపు అలా ఉంటోంది. ఆ తర్వాత పాప ఎక్కడ దాక్కుందో వెతికి (వాసన చూసి) కనిపెట్టేస్తోంది.




ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో కుక్క పేరు మంకీ అట. వీడియో చూశారుగా ఎంత బాగుందో. అందరికీ తెగ నచ్చుతోంది. కుక్క హైడ్ అండ్ సీక్ భలే ఆడుతోందే అని అంటున్నారు.

ఇందులో పాప... ఏం చెప్పినా కుక్కకు అర్థమైపోతోంది. ఆ చిన్నారి "మంకీ మనం హైడ్ అండ్ సీక్ ఆడదాం. నువ్వు నంబర్లు లెక్కపెట్టు" అనగానే కుక్క... చూశారా ఎలా గోడకు అతుక్కుపోయిందో. మధ్యలో కుక్క వెనక్కి తిరిగి చూసినప్పుడు... పాప ఇంకా దాక్కోలేదు. ఏమందంటే... "ఏయ్ దొంగా అలా చూడకూడదు" అంది. దాంతో కుక్క మళ్లీ గోడవైపు తిరిగి అలా కాసేపు ఉండిపోయింది. ఆ తర్వాత పాపను వెతికేందుకు వెళ్లింది.

GSDfriend అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోని అప్‌లోడ్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోని 2 లక్షల మంది చూశారు. 24 వేల మందికి పైగా లైక్ చేశారు. చాలా మంది కామెంట్స్ సెక్షన్‌లో రెడ్ హార్ట్ ఇమోజీని పెట్టారు. కొంతమంది రెడ్ హార్ట్ షేప్ కళ్లు ఉండే ఇమోజీని పెట్టారు. అంటే వాళ్లకు ఈ వీడియో అంత బాగా నచ్చిందన్న మాట. అందుకే మనం కూడా ఇలాంటివి మిస్సవకుండా చూసేయాలి.
Published by: Krishna Kumar N
First published: May 10, 2020, 2:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading