లాక్‌డౌన్‌ డేస్... సల్మాన్‌ఖాన్ అలా... రవిబాబు ఇలా... వైరల్ వీడియోస్...

Corona Lockdown | Corona Update : లాక్‌డౌన్‌లో సినీ సెలబ్రిటీలు... షూటింగ్స్ లేకపోవడంతో... మనలాగే రోజువారీ కార్యకలాపాల్లో తలమునకలవుతున్నారు.

news18-telugu
Updated: June 7, 2020, 6:57 AM IST
లాక్‌డౌన్‌ డేస్... సల్మాన్‌ఖాన్ అలా... రవిబాబు ఇలా... వైరల్ వీడియోస్...
సల్మాన్ ఖాన్, రవిబాబు (credit - instagram)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఇల్లు శుభ్రం చేసుకోవడం, వంటలు వండటం, గార్డెనింగ్ ఇలా... సినీ సెలబ్రిటీలు... లాక్‌డౌన్ సమయంలో... ఇళ్లలోనే ఉంటూ... పనులు చేసుకుంటున్నారు. షూటింగ్ లేకపోవడంతో... ఎప్పుడూ చెయ్యని పనులు ఇప్పుడు చేస్తున్నారు. తాము ఏం చేస్తున్నదీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకుంటూ... వారు పెట్టే కామెంట్లను చదువుతూ కాలక్షేపం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్... ఫాంహౌస్‌‌లో రాలిపడిన ఆకులు, చెత్తను ఊడ్చాడు. ఆ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు షేర్ చేశాడు. సల్మాన్‌తో ప్రేమలో ఉన్నట్లు చెప్పుకుంటున్న యూలియా వంటుర్‌ కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నారు. ఇది ఇప్పుడు వైరల్ అయ్యింది.
 View this post on Instagram
 

#SwachhBharat #WorldEnvironmentDay Music Credits: Mark Mothersbaugh


A post shared by Salman Khan (@beingsalmankhan) on

ఇక టాలీవుడ్‌ నటుడు, దర్శకుడు రవిబాబు ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఏం చేశాడన్నది ఇప్పుడు వైరల్ అయ్యింది. సూపర్‌ మార్కెట్‌లోకి వెళ్తున్నప్పుడు ముందుగా సెక్యూరిటీ గార్డు రవిబాబును థెర్మల్ స్క్రీనింగ్ చేశారు. చక్కగా స్క్రీనింగ్ చేయించుకున్న రవిబాబు... మరి నీకో... అంటూ... తన జేబు లోంచీ థెర్మల్ స్క్రీనింగ్ మెషిన్ తీసి... సెక్యూరిటీ గార్డును స్క్రీన్ చేశాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లారు. ఈ వీడియో ఫన్నీగా ఉందంటూ నెటిజన్లు హ్యాపీ కామెంట్స్ పెడుతున్నారు. 
View this post on Instagram
 

Had myself some fun today!😂😂😂


A post shared by Ravi Babu (@ravibabuofficial) on
First published: June 7, 2020, 6:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading