ఫేమస్ శవపేటిక మీమ్‌కి కీప్యాడ్ డోర్ లాక్‌తో ట్రాక్... వైరల్ వీడియో

Corona Lockdown | Corona Update : మీమ్స్ చూసేవారికి శవపేటిక డాన్స్ మీమ్ తెలిసే ఉంటుంది. ఇప్పుడు అది మరోసారి వైరల్ అయ్యింది.

news18-telugu
Updated: May 13, 2020, 2:21 PM IST
ఫేమస్ శవపేటిక మీమ్‌కి కీప్యాడ్ డోర్ లాక్‌తో ట్రాక్... వైరల్ వీడియో
ఫేమస్ శవపేటిక మీమ్‌కి కీప్యాడ్ డోర్ లాక్‌తో ట్రాక్... వైరల్ వీడియో (credit - twitter and youtube)
  • Share this:
Corona Lockdown | Corona Update : క్రియేటివిటీ చూపించుకోవాలంటే ఎన్నో మార్గాలు. ఆ యూట్యూబర్ కూడా అదే చేశాడు. డోర్ లాక్ కీప్యాడ్‌పై శవపేటిక డాన్స్ మీమ్ ట్రాక్ సృష్టించాడు. లాక్‌డౌన్ కాలంలో చాలా మంది కొత్తకొత్తగా చేస్తున్నారు. ఇంట్లో ఉంటూ... తమ బ్రెయిన్‌కి పదును పెడుతున్నారు. సోషల్ మడియాలో ఆఫ్రికా ఘనా దేశస్తుల శవపేటిక మీమ్ (Coffin Dance Meme) చాలా మందికి తెలిసిందే. చాలా మంది ఏదైనా ఘటనపై స్పందిస్తూ... సెటైర్లు వేయాలనుకునేటప్పుడు ఈ మీమ్‌నే పోస్ట్ చేస్తుంటారు. అందువల్ల కొన్ని కోట్ల మీమ్స్‌లో ఇది ఫేమస్ అయ్యింది. ఇందులో మ్యూజిక్ ట్రాక్ కూడా ఎంతో హుషారుగా ఉంటుంది. అందుకే ఇది ఎక్కువ మందికి నచ్చింది.


ఈ మ్యూజిక్ ట్రాక్‌ను ఇప్పటికే చాలా మంది పియానోపై వాయించారు. తాజాగా యూట్యూబ్‌లో పాపుర్ మ్యుజీషియన్ అయిన కర్ట్ హ్యూగో షీనెర్ (KHS)... శవపేటిక సాంగ్‌ను డోర్ లాక్ కీప్యాడ్‌పై సృష్టించాడు. సాంగ్‌లో మ్యూజిక్ ఎలా వస్తుందో అలాగే వచ్చేలా... బటన్స్ నొక్కుతూ... క్రియేట్ చేశాడు. సేమ్ ట్యూన్ రావడంతో... ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
జనరల్‌గా కీప్యాడ్‌పై బటన్లు ఒక్కోటీ ఒక్కో రకమైన సౌండ్ ఇస్తాయి. KHS వాటన్నింటినీ బ్రెయిన్‌లోకి ఎక్కించుకున్నాడు. శవపేటిక మీమ్ మ్యూజిక్‌కి తగ్గట్టుగా అవి ప్లే అవ్వాలంటే... ఎప్పుడు ఏ బటన్ నొక్కాలో బాగా ప్రాక్టీస్ చేశాడు. అచ్చుగుద్దినట్లు ఆ సాంగ్‌లాగే కాకపోయినా... దాదాపు అలాంటి ట్రాకే ఇక్కడా వచ్చింది. KHS ఇదివరకు ఓషన్ ఐస్ సాంగ్ కూడా... బంగాళాదుంపలతో సృష్టించాడు.
Published by: Krishna Kumar N
First published: May 13, 2020, 2:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading