Home /News /trending /

CORONA POSITIVE FOR THREE INDIAN CRICKETERS SHIKHAR DHAWAN RUTURAJ GAIKWAD AND SHREYAS IYER AHEAD OF WEST INDIES ODI SERIES SNR

భారత జట్టులో ముగ్గురికి కరోనా పాజిటివ్..విండీస్‌ వన్డేకు ముందే వైరస్ వర్రీ..

Photo Credit:Instagram

Photo Credit:Instagram

Covid Fever:భారత జట్టు ఆడబోయే 1000 వన్డేకి శకునం బాగున్నట్లు లేదు. ఆదివారం జరగబోయే మ్యాచ్‌కి ముందే టీమిండియాకి చెందిన స్టార్‌ క్రికెటర్లు ముగ్గురు కరోనా బారినపడ్డారు. శిఖర్‌ధావన్, రుతురాజ్‌ గైక్వాడ్, శ్రేయస్‌ అయ్యర్‌కి పాజిటివ్‌గా తేలడంతో ఐసోలేషన్‌లో ఉన్నారు.

ఇంకా చదవండి ...
భారత్‌ ఆడబోయే 1000 వన్డే మ్యాచ్‌కి ముందే కోవిడ్‌ ఫీవర్‌ వణికిస్తోంది. వెస్టిండీస్‌ (West indies)టీమిండియా (India)ఆడబోయే మూడు వన్డేల సిరీస్‌కు ముందే భారత జట్టులోని ముగ్గురు కీలక ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌(Corona positive)గా తేలింది. స్టార్ ప్లేయర్స్ శిఖర్‌ ధావన్(Shikhar Dhawan), శ్రేయస్‌ అయ్యర్(Shreyas Iyer), రుతురాజ్‌ గైక్వాడ్‌(Ruturaj Gaikwad)కి పాజిటివ్ వచ్చినట్లుగా ప్రముఖ క్రీడా వార్తల పత్రిక వెల్లడించింది. వీరితో పాటు మరో ఐదుగురు సహాయ సిబ్బంది కూడా కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. వీరంతా ఐసోలేషన్‌(Isolation)లో ఉన్నారు. మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ కోసం టీమిండియా ఆటగాళ్లు గత నెల 31న అహ్మదాబాద్‌ (Ahmedabad)చేరుకున్నారు. తొలి వన్డే మ్యాచ్‌ ఫిబ్రవరి (February)6న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra modi stadium)లో జరగాల్సి ఉంది. ప్రస్తుతం ముగ్గురిలో కరోనా లక్షణాలు లేకపోయినప్పటికి ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లో పాజిటివ్ రావడంతో వన్డే సిరీస్‌కి టీమిండియా టాప్ ప్లేయర్స్ శిఖర్‌ ధావన్, శ్రేయస్‌ అయ్యర్, రుతురాజ్‌ గైక్వాడ్‌ జట్టులో ఉండటం కష్టంగానే కనిపిస్తోంది. ముగ్గురు ఆటగాళ్లు వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండి రెండు సార్లు ఆర్టీపీసీ ఆర్‌ టెస్ట్‌లు నెగిటివ్ (Rt pcr test negative)వస్తేనే సిరీస్‌లో అడే అవకాశం ఉంది. ఇందులో ఇంకా విచారించదగిన విషయం ఏమిటంటే రిజర్వ్‌ ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఏడాదిన్నరలో కరోనా బారినపడటం ఇది రెండోసారి. 2020ఐపీఎల్‌ టైమ్‌లో ఫస్ట్‌ టైమ్‌ కరోనా బారినపడ్డ గైక్వాడ్‌ 14రోజుల క్వారంటైన్‌లో ఉండి అప్పటి ఫస్ట్‌ సెక్షన్‌లో ఆడలేకపోయాడు.

ముగ్గురికి పాజిటివ్..
టీమిండియా జట్టులో కెప్టెన్‌ రోహిత్‌శర్మ, సీనియర్‌ ప్లేయర్‌ విరాట్‌కోహ్లీతో పాటు కోచ్‌ రాహుల్‌ద్రావిడ్‌కి నెగిటివ్ వచ్చింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం రోజు ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు నిర్వహిస్తుండటంతో వీరికి రెండు సార్లు నెగిటివ్ వచ్చినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. మూడు వన్డేల సిరీస్‌ కోసం అటు భారత ఆటగాళ్లు, అటు కరేబియన్‌ జట్టు అహ్మదాబాద్‌కి చేరుకున్నాయి. వన్డే సిరీస్‌పై రెండు జట్లు కన్నేశాయి. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకులను అనుమతించబోమని గుజరాత్‌ క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించింది.



Considering the current situation, all the matches will be played behind the closed doors.

— Gujarat Cricket Association (Official) (@GCAMotera) February 1, 2022

వెయ్యో వన్డే గెలిచేనా ..
ఇప్పటి వరకూ వెయ్యి వన్డేలు ఆడబోతున్న తొలి జట్టు భారత్‌ మాత్రమే కావడం గొప్ప విశేషం. ఇలాంటి సమయంలో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు వైరస్‌ బారినపడటంతో క్రికెట్‌ అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు. వెయ్యి వన్డేల మార్కులో తొలి మూడు జట్లలో భారత్‌ ఆదివారం మ్యాచ్‌తో 1000 వన్డేని పూర్తి చేసుకోనుంది. ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా 998 వన్డేలు, పాకిస్థాన్ 936 వన్డేలు ఆడి సెకండ్‌, థర్డ్‌ పొజిషన్‌లో నిలిచాయి.
Published by:Siva Nanduri
First published:

Tags: Covid cases, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు