కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA)కరెంట్ స్తంభం ఎక్కాడు. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానికులు చెప్పడంతో ఎమ్మెల్యే ఈ సాహసం చేశారు. అయితే ఖద్దరు డ్రెస్ వేసుకొని కారు దిగని స్థాయి నేత ఓ పల్లెటూరికి వచ్చి కరెంట్ స్తంభం ఎక్కి విద్యుత్ వైర్లు తగిలిస్తున్న వీడియో(Video) ఇప్పుడు వైరల్(Viral)అవుతోంది. ఈవార్త మధ్యప్రదేశ్(Madhya pradesh)లో చోటు చేసుకుంది. షెయోపూర్(Sheopur)నియోజకవర్గ ఎమ్మెల్య బాబులాల్ జాండెల్ (Babulal Jandel)ఈవిధంగా కరెంట్ స్తంభం(Current pole) ఎక్కి మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే కరెంట్ బిల్లులు చెల్లించకపోవడం వల్లే విద్యుత్ సరఫరా నిలిపివేస్తే ఎమ్మెల్యే ఎలా వైర్లు తగిలిస్తారనే విమర్శలు కూడా వస్తున్నాయి.
కరెంట్ స్తంభం ఎక్కిన ఎమ్మెల్యే..
సాధారణంగా ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజాప్రతినిధులు ఓటర్ల సమస్యలు ఆలకిస్తారు. గెలవడం కోసం ప్రచారం పేరుతో పనులు చేయడం, ఫోటోలకు ఫోజులివ్వడం కోసం రోడ్లు శుభ్రం చేయడం, ఓటర్ల వ్యక్తిగత పనులు చేయడం చూస్తుంటాం. కాని మధ్యప్రదేశ్‌లోని షెయోపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాబులాల్ జాండేల్ మాత్రం ఇప్పుడు వార్తల్లో నిలిచారు. మంగళవారం భారత్ జోడో అభియాన్ యాత్రలో భాగంగా కథోడి గ్రామానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో కరెంట్ లేకపోవడంతో గ్రామస్తుల్ని ఏం జరిగిందని అడిగారు.
వైరల్ అవుతున్న వీడియో ..
కరెంట్ బిల్లులు కట్టలేదని విద్యుత్‌శాఖ అధికారులు సరఫరా నిలిపివేశారని చెప్పడంతో ఎమ్మెల్యే మరుసటి రోజు ఉదయమే గ్రామానికి వచ్చారు. ఊరి చివర ఉన్న విద్యుత్ స్తంభంపైకి ఎక్కి కరెంట్ సప్లై వైర్లను తగిలించి కరెంట్ వచ్చేలా చేశారు. అయితే ఒక ఎమ్మెల్యే కరెంట్ స్తంభం ఎక్కి విద్యుత్ పునరుద్ధరణ చేయడం చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఆ దృశ్యాన్ని తమ ఫోన్‌తో షూట్ చేసి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
ఉద్యోగులకు వివరణ..
గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేసిన సిబ్బందికి ఫోన్ చేసిన ఎమ్మెల్యే కారణాలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ బకాయిలు చెల్లించే వరకు కరెంట్ సప్లై నిలిపివేయమని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడం వల్లే పవర్ కట్ చేశామని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే గ్రామస్తులు పంట అమ్మిన తర్వాత బకాయి కరెంట్ బిల్లులు చెల్లిస్తారని అధికారులకు వివరణ ఇచ్చారు.
ఆయనకది మాములే..
గ్రామస్తుల మెప్పు కోసం ఎమ్మెల్యే కరెంట్ స్తంభం ఎక్కిన వీడియో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి ఎమ్మెల్యే గాయపడితే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే జండెల్ ఇలాంటి సాహసాలు చేయడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా గేటు పగలగొట్టి చంబల్ కాలువలో దూకి జైలుకు కూడా వెళ్లిన విషయాన్ని నియోజకవర్గ ప్రజలు గుర్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Madhya pradesh, Trending news, Viral Video