Rahul Gandhi: ఎందుకొచ్చాంరా బాబు అన్నట్టుగా ఉన్న రాహుల్‌గాంధీ.. వైరల్ అవుతున్న మీమ్స్

rahul gandhi (Image credits Twitter)

Rahul Gandhi: ఒకవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (FM nirmala sitharaman) బడ్జెట్ (Union Budget) ప్రవేశపెట్టిన తరువాత కూడా ఏమరపాటుగా కనిపించారు. ఆయనపై ఆన్‌లైన్లో వస్తున్న మీమ్స్‌ ఇప్పుడు ట్రెండింగ్‌గా నిలుస్తున్నాయి.

  • News18
  • Last Updated :
  • Share this:
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని అభిమానించేవారితో పాటు విమర్శించేవారు కూడా చాలామంది ఉన్నారు. ఆయనపై పొలిటికల్ మీమ్స్ ఇంటర్నెట్‌లో ప్రతిసారీ వైరల్ అవుతుంటాయి. గత వారం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఇంగ్లీష్‌లో ఏదో మాట్లాడారు. అది ఎవరికీ అర్థం కాక తలలు పట్టుకున్నారు అక్కడికి వచ్చిన జనం. దీంతో ఆయన స్పీచ్‌పై ఇంటర్నెట్‌లో మీమ్స్ వైరల్ అయ్యాయి. ఇలాంటి ఆన్‌లైన్ ట్రోలింగ్ (Online trolling) ఆయనకు కొత్తేమీ కాదు. సోమవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల (parliament budget session) కు హాజరైన రాహుల్‌ గాంధీ, బడ్జెట్‌పై ఏమాత్రం ఆసక్తి లేనట్లు కనిపించారు.

ఒకవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (FM nirmala sitharaman) బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత కూడా ఏమరపాటుగా కనిపించారు. ఆయనపై ఆన్‌లైన్లో వస్తున్న మీమ్స్‌ ఇప్పుడు ట్రెండింగ్‌గా నిలుస్తున్నాయి. రాహుల్ గాంధీ విసుగు చెందినట్లు కనిపిస్తున్న ఫోటోలపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. మాస్కు ధరించిన ఆయన, ఒక సందర్భంలో నిద్రలోకి జారుకుంటున్నట్లు ఫోటోలో కనిపిస్తోంది.





ఈ ఫోటోపై చాలామంది మీమర్స్ జోకులు పేలుస్తున్నారు. ఫన్నీ కామెంట్లు పెడుతూ షేర్ చేస్తున్న రాహుల్ గాంధీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. పొద్దున్నే లేచి ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యే వ్యక్తి ఇలాగే ఉంటాడని ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు. ప్రేమించిన వ్యక్తి వేరే అబ్బాయితో కనిపించినప్పుడు రియాక్షన్ ఇలాగే ఉంటుందని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఏదో పాస్‌వర్డ్ మర్చిపోయి బాధపడుతున్నప్పుడు మనం ఇలాగే ఉంటామని ఇంకొక వ్యక్తి ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ మీమ్స్‌ ట్విట్టర్లో వైరల్‌గా మారుతున్నాయి.

















బడ్జెట్‌ సమావేశాలకు వెళ్లడానికి ముందు రాహుల్‌ గాంధీ ఒక ట్వీట్ చేశారు. ఎంఎస్ఎంఈలు, రైతులు, కార్మికులకు బడ్జెట్‌లో పెద్దపీట వేయాలని, హెల్త్ కేర్ ఖర్చును పెంచాలని ట్వీట్‌లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశ సరిహద్దుల రక్షణ కోసం ఎక్కువ నిధులను కేటాయించాలని కోరారు. తాజా బడ్జెట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబులు మారకపోవడంతో మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులకు ఎలాంటి ఉపశమనం కలగలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Published by:Srinivas Munigala
First published: