హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Congress: ముగిసిన రాహుల్ గాంధీ విచారణ .. 9 గంటల పాటు ఈడీ ప్రశ్నలు, రేపు కూడా మరోసారి..

Congress: ముగిసిన రాహుల్ గాంధీ విచారణ .. 9 గంటల పాటు ఈడీ ప్రశ్నలు, రేపు కూడా మరోసారి..

ఈడీ విచారణ తర్వాత బైటికొస్తున్న రాహుల్ గాంధీ

ఈడీ విచారణ తర్వాత బైటికొస్తున్న రాహుల్ గాంధీ

National herald case: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో సోమవారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హజరయ్యారు. దాదాపు 9 గంటల పాటు ఈడీ, రాహుల్ పై ప్రశ్నల వర్షం కురిపించింది.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలు (Rahul gandhi and sonia gandhi) తమ ముందు హజరవ్వాలని ఈడీ గతంలో నోటిసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. నేడు.. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం ఈడీ (Enforcement directorate) ఎదుట విచారణకు హజరయ్యారు. ఈడీ అధికారులు ఆయనను దాదాపు 9 గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. నేషనల్ హెరాల్డ్ కు సంబంధించి,పలు కీలక విషయాలపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

కొన్నింటికి రాహుల్ వద్ద నుంచి లిఖిత పూర్వకంగా సమాధానాలను ఈడీ తీసుకున్నట్లు సమాచారం. నేషనల్ హెరాల్డ్ కేసుకు (national herald case) సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత (congress) రాహుల్ గాంధీ (rahul gandhi) ఈడీ విచారణ ముగిసింది. దాదాపు తొమ్మిది గంటల పాటు ఆయనను ప్రశ్నించారు ఎన్‌ఫోర్స్‌మెంట్ (enforcement directorate) అధికారులు. దీనికి సంబంధించి ఈడీ.. రాహుల్ వద్ద నుంచి లిఖిత పూర్వకంగా సమాధానాలను తీసుకుంది.

ఉదయం మూడు గంటలు , సాయంత్రం ఐదున్నర గంటలు మొత్తం ఎనిమిదిన్నర గంటల పాటు ఈడీ అధికారులు రాహుల్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ లంచ్ బ్రేక్ నిమిత్తం 2.30 గంటలకు ముగిసింది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై రాత్రి 9.30 గంటలకు ముగిసింది. రేపు మరోసారి ఈడీ ఎదుట రాహుల్ హజరవుతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా  నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసు (National Herald corruption case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఎదుట విచారణకు హాజరైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. మధ్యలో గ్యాప్ దొరకగానే హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి తల్లి సోనియా గాంధీని కలుసుకున్నారు.

బ్రేక్ గడువు ముగిసేలోపే తిరిగి ఈడీ ఆఫీసులకు వచ్చేశారు. అన్ లిస్టెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) పేరుతో తప్పు దారిలో వడ్డీ లేని రుణాలు పొందారనే ఆరోపణలకు సంబంధించిన ‘నేషనల్ హెరాల్డ్’ కేసులో రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సైతం నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. రాహుల్ విచారణ సందర్భంగా ఢిల్లీలోని ఈడీ, కాంగ్రెస్ ఆఫీసుల వద్ద ఉద్రిక్తత నెలకొంది.

వివరాలివే.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హాజరైన రాహుల్ గాంధీ ఏకబిగిన 3 గంటల సేపు విచారణను ఎదుర్కొన్నారు. అనంతరం ఆయన ఈడీ కార్యాలయాన్ని విడిచిపెట్టారు. అక్కడి నుంచి నేరుగా గంగారాం ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న తన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుసుకున్నారు. ఆ సమయంలో రాహుల్ వెంట సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు.

First published:

Tags: Congress, Delhi, Enforcement Directorate, Rahul Gandhi

ఉత్తమ కథలు