హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Photo : శవపేటిక టైప్ లో ఆఫీసులో కుర్చీలు..వర్క్ చేస్తూ చనిపోతే మూసేసి తీసుకెళ్లడమే

Viral Photo : శవపేటిక టైప్ లో ఆఫీసులో కుర్చీలు..వర్క్ చేస్తూ చనిపోతే మూసేసి తీసుకెళ్లడమే

శవపేటిక లాంటి కుర్చీ

శవపేటిక లాంటి కుర్చీ

Chairbox design:చాలా మంది ఉద్యోగులు చాలాసార్లు ఆఫీస్‌(Office)లో కూర్చుని పనిచేస్తున్నప్పుడు...ఏదో ఓ రోజూ ఈ పని చేస్తూనే చస్తాన్ రా బాబు,ఈ పని అయ్యేలోపు నా ప్రాణం పోతుంది అని అనుకుంటుంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Chairbox design:చాలా మంది ఉద్యోగులు చాలాసార్లు ఆఫీస్‌(Office)లో కూర్చుని పనిచేస్తున్నప్పుడు...ఏదో ఓ రోజూ ఈ పని చేస్తూనే చస్తాన్ రా బాబు,ఈ పని అయ్యేలోపు నా ప్రాణం పోతుంది అని అనుకుంటుంటారు. అయితే సీరియస్‌గా కాకుండా చిరాకులో ఉన్నప్పుడు ఇటువంటి మాటలు అంటుంటారు. అయితే యూకేలోని చైర్ బాక్స్ కంపెనీ మాత్రం ఉద్యోగుల అలాంటి మాటలను సీరియస్‌గా తీసుకుంది. ఏకంగా శవపేటికల లాంటి కుర్చీలను ఉద్యోగుల కోసం రెడీ చేసింది. దీంతో ఎవరైనా ఉద్యోగి ఆ కుర్చీలో కూర్చొని మరణిస్తే సమాధి దగ్గరకు తీసుకెళ్లడానికి వీలుపడుతుందని కంపెనీ తెలిపింది. కాగా,శవపేటిక ఆకారంలో ఉన్న ఆఫీసు కుర్చీ ఫొటోలను చైర్ బాక్స్ కంపెనీ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ శవపేటిక కుర్చీ యొక్క ప్రత్యేకతను వివరిస్తూ కంపెనీ..."మేము మా కొత్త ఉత్పత్తిని పరిచయం చేయడం సంతోషంగా ఇది చివరి షిఫ్ట్ ఆఫీస్ చైర్. ఒక ఉద్యోగి పనిలో చనిపోతే, మేనేజ్‌మెంట్ టాప్ కవర్‌ ను దానికి వేసి, ఆ కుర్చీ టైపు శవపేటికను కార్పొరేట్ స్మశానవాటికకు తరలించాలి. సరళమైనది అయినప్పటికీ సమర్థవంతమైనది"అని తెలిపింది.

చైర్‌బాక్స్ అంటే ఆఫీసులో చనిపోయే ఏర్పాటు!

UK కంపెనీ చైర్‌బాక్స్ ఈ కుర్చీని తయారు చేసింది. దీనికి "ది లాస్ట్ షిఫ్ట్ ఆఫీస్ చైర్" అనే ట్యాగ్‌లైన్ ఇవ్వబడింది. ఎక్కువ సేపు కంప్యూటర్‌ ముందు కూర్చుని పనిచేసే వారి కోసం ఇది రూపొందించబడింది. ఇది శవపేటిక రూపకల్పనతో పేటికపై నిర్మించబడింది. కుర్చీ యొక్క 3D మోడల్ ఆఫీస్ కుర్చీని శవపేటిక రూపంలో చూపుతుంది, ఈ కుర్చీ యొక్క చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా గా మారాయి. అయితే ఈ ఫొటోలను చూసిన కొందరు నెటిజన్లు "నో థాంక్స్"అని కామెంట్స్ చేస్తున్నారు.

Ashok Gelhot : రాజస్తాన్ ఎఫెక్ట్..కాంగ్రెస్ అధ్యక్ష రేస్ నుంచి గెహ్లాట్ ఔట్

8 గంటల పాటు కూర్చోవడం వల్ల ప్రమాదాలు

ఆరోగ్యం విషయానికొస్తే.. ధూమపానం మాత్రమే కాదు, రెగ్యులర్ సిట్టింగ్ కూడా జీవితానికి ప్రాణాంతకం. ఎక్కువ కూర్చోవడం వల్ల, మనం నెమ్మదిగా మరణాన్ని మన వైపుకు లాగబడుతున్నామని డాక్టర్లు చెబుతారు. ఈ క్రమంలో కంపెనీ తన వెబ్‌సైట్‌లో... 'మనుషులు 8 గంటలు కుర్చీలో కూర్చునేలా చేయబడలేదు. ఈ ఆచరణాత్మక మార్పును మన శరీరం ఇంకా అంగీకరించలేకపోయింది. వ్యాయామం చేసిన తర్వాత కూడా సరిపోదు. ప్రజలకు స్టాండింగ్ డెస్క్‌లు ఇవ్వాలని బ్రిటన్‌లో చట్టం కూడా ఉంది. దీనిపై ఇంకా తగినంత అవగాహన లేదు. పని చేస్తూ ఎవరైనా చనిపోతే కంపెనీ వారు చివరి మేకు వేసి శ్మశానవాటికకు తీసుకెళ్లాలి అంతే అంటూ డిజైనర్ చేసిన వ్యాఖ్య నిజంగా కలకలం రేపుతోంది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Uk, Viral photo

ఉత్తమ కథలు