విహారిని మెచ్చుకుంటూ హర్ష బోగ్లే తెలుగు ట్వీట్... వైరల్!

విజయలక్ష్మి గారూ... మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు...’ అంటూ ట్వీట్ చేసిన హర్ష బోగ్లే... 16వేలకు పైగా లైక్స్... వేలల్లో రీట్వీట్స్!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 10, 2018, 1:40 PM IST
విహారిని మెచ్చుకుంటూ హర్ష బోగ్లే తెలుగు ట్వీట్... వైరల్!
క్రికెట్ కామెంటేటర్ హర్ష బోగ్లే
  • Share this:
ఇంగ్లండ్ టూర్లో టీమిండియా ఆడుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఆరంగేట్రం చేశాడు తెలుగు కుర్రాడు హనుమ విహారి. వస్తూనే వీరవిహారం చేస్తూ... జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడి తనెంత స్పెషల్ ఆటగాడో నిరూపించుకున్నాడు. 124 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 1 సిక్సర్‌తో 56 పరుగులు చేసిన హనుమ విహారి... ఆరంగేట్రం మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ సాధించిన 26వ భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. అతిక్లిష్టమైన ఇంగ్లండ్ గడ్డ మీద ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్ విహారియే.

విహారి ఆటకు ఫిదా అయిన క్రికెట్ కామెంటేటర్, ‘వాయిస్ ఆఫ్ క్రికెట్’ హార్ష బోగ్లే తెలుగులో ట్వీట్ చేసి, అందర్నీ ఆకట్టుకున్నాడు. ‘విజయలక్ష్మి గారూ... మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు...’ అంటూ ట్వీట్ చేశాడు హర్ష బోగ్లే. ఈ ట్వీట్‌కు 16వేలకు పైగా లైక్స్ రాగా, మూడున్నర వేల మంది రీట్వీట్ చేశారు. హర్ష బోగ్లే చేసే ట్వీట్స్‌లో ఇదే హ్యాయెస్ట్ లైక్స్, రీట్వీట్స్ పొందిన ట్వీట్ కావడం విశేషం.

మరాఠీ కుటుంబానికి చెందిన హర్ష బోగ్లే... పుట్టింది, పెరిగింది మొత్తం హైదరాబాద్‌లోనే. బేగంపేట్ హైదరాబా స్కూళ్లో చదువుకున్న హర్ష బోగ్లే... ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేశాడు. క్రికెట్ కామెంటేటర్‌గా తనదైన ముద్ర వేసుకుని, ‘వాయిస్ ఆఫ్ క్రికెట్’ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అప్పుడప్పుడు ఆయన కామెంట్రీ తెలుగు పదాలు దొర్లుతుంటాయి. ఓ సారి క్రికెట్ గురించి జరిగిన చర్చల్లో వరంగల్ గురించి ప్రస్తావించి, తెలుగువారిని ఆకర్షించారు హర్షా బోగ్లే. పన్నేండేళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన హనుమ విహారికి అన్నీతానై పెంచి, పెద్ద చేసింది విజయలక్ష్మి. ఆమె కష్టం గురించీ, విహారి ఆట గురించి తెలుసుకున్న హర్ష బోగ్లే... ఇలా ఆత్మీయంగా ట్వీట్ చేసి, క్రికెట్ అభిమానులకు మరింత చేరువయ్యారు.
Loading...
ఇవీ చదవండి...

VIDEO: భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో భారత లేటెస్ట్ స్టార్స్

ఓవల్ టెస్ట్ : భారత తుది జట్టులో తెలుగు తేజం 'హనుమ విహారి'

టెస్ట్‌ల్లో నెం. 1 విరాట్‌ను మించినోడు మన ‘విహారి’!
First published: September 10, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...