అప్పట్లో అది నరమాంస భక్షకుల అడ్డా... కొలంబస్ అప్పుడే చెప్పాడు...

Washington : కొలంబస్ చెప్పిన విషయాన్ని అప్పట్లో చాలా మంది చరిత్రకారులు కొట్టేశారు. అంత సీన్ లేదన్నా్రు. కానీ ఇప్పుడు నిజం బయటపడింది. కొలంబస్ చెప్పిందే నిజమని తేలింది.

news18-telugu
Updated: January 14, 2020, 2:57 PM IST
అప్పట్లో అది నరమాంస భక్షకుల అడ్డా... కొలంబస్ అప్పుడే చెప్పాడు...
అప్పట్లో అది నరమాంస భక్షకుల అడ్డా... కొలంబస్ అప్పుడే చెప్పాడు... (credit - twitter - Manfred Rosenberg)
  • Share this:
Washington : నరమాంస భక్షకులు... ఈ రోజుల్లో ఈ పదం పెద్దగా వాడుకలో లేదు. ఓ 20 ఏళ్ల కిందటి వరకూ ఈ పదాన్ని చాలా మంది వాడేవాళ్లు. మనుషుల మాంసాన్ని తినేవారే నరమాంస భక్షకులు. ఇలాంటి వ్యక్తుల గురించి చరిత్రలో చాలా కథలున్నాయి. ముఖ్యంగా ప్రపంచ యాత్రికుడు క్రిష్టోఫర్‌ కొలంబస్‌.... 500 ఏళ్ల కిందట వీళ్ల గురించి ప్రత్యేకించి చెప్పాడు. ప్రపంచ పర్యటనలో భాగంగా తాను... కరీబీయన్ దీవుల వైపు వెళ్లినప్పుడు... అక్కడ మనుషుల్ని తినే వారు కనిపించారని రాశాడు. అప్పట్లో అది ఎవరూ నమ్మలేదు. మనుషుల్ని మనుషులు ఎలా తింటారు. అంత లేదు అన్నారు. కొందరైతే... కొలంబస్... కావాలని లేనిపోనివి ఉన్నట్లుగా చెబుతున్నాడని విమర్శించారు. కాలం గతించిపోయింది. ఇప్పుడు రకరకాల టెక్నాలజీలు వచ్చాయి. వాటిలో ఫేషియల్ రికగ్నిషన్ ఒకటి. దాన్ని ఉపయోగించి... 500 ఏళ్ల కిందటి కరీబియన్ వాసుల పుర్రెల్ని పరిశీలించగా... నరమాంస భక్షకులు ఉన్న మాట నిజమేనని తేలింది. సో... కొలంబస్ చెప్పింది నిజమేనన్నమాట.


1492లో ఏం జరిగిందంటే... కొలంబస్ నౌకలు... కరీబియన్‌ ప్రాంతంలోకి వెళ్లాయి. అప్పటికే దక్షిణ అమెరికాకు చెందిన కరీబీ ఆక్రమణదారుల్ని కొలంబస్ చూశాడు. వాళ్లు జమైకా, హిస్పానియోలా, బహమాస్‌ దీవులపై దండెత్తి... అక్కడ ప్రశాంతంగా బతికే అరావాక్‌ తెగ మహిళల్ని బంధించి... మగాళ్లను చంపి తినేయడాన్ని గమనించాడు. అదే విషయాన్ని అందరికీ చెప్పాడు. ఐతే... తర్వాతి కాలంలో పురావస్తు శాస్త్రవేత్తలు... కొలంబస్ చెప్పింది అబద్ధం అన్నారు. కరీబీలకు అంత సామర్ధ్యం లేదనీ... వాళ్లు 1600 కిలోమీటర్లు ప్రయాణించి... కరీబియన్ దీవులకు ఎలా వెళ్లగలరని ప్రశ్నించారు. వాళ్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు కొలంబస్ జీవించి లేడు.ఇక ఇప్పుడు తాజాగా కరీబియన్ ప్రాంతంలో కనిపించిన 100 పురాతన పుర్రెల్ని విశ్లేషించారు. కొలంబస్‌... కరీబియన్ దీవులకు వెళ్లినప్పుడు... కరీబీలు అక్కడే ఉన్నట్లు తేల్చారు. వాళ్లు నిజంగానే మనుషుల్ని చంపి తిన్నారని లెక్కలేశారు. సో... కొలంబస్ చెప్పింది నిజమేనని తేలింది.
First published: January 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>