HOME »NEWS »TRENDING »colour blind boy sees colours first time in his life video getting viral in internet hsn gh

Viral video: మొదటిసారి రంగులను చూసిన కలర్ బ్లైండ్‌నెస్ ఉన్న వ్యక్తి.. వైరల్ అవుతోన్న వీడియో

Viral video: మొదటిసారి రంగులను చూసిన కలర్ బ్లైండ్‌నెస్ ఉన్న వ్యక్తి.. వైరల్ అవుతోన్న వీడియో
McKinley Mac Erves

మెకన్లీ మ్యాక్ అనే 22సంవత్సరాల వ్యక్తికి కలర్ బ్లైండ్‌నెస్‌ ఉంది. దీంతో అతడు అన్ని రకాల రంగులను, రంగుల మధ్య తేడాలను గుర్తించలేడు. ఈ సమస్య గురించి తెలుసుకున్న మెక్ స్నేహితులు, అతడికోసం ప్రత్యేకంగా కలర్ బ్లైండ్ గ్లాసెస్ తయారు చేయించారు. తాజాగా దాన్ని అతడికి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ కళ్లజోడు పెట్టుకున్న తరువాత మొదటిసారి అన్ని రకాల రంగులను చూసి..

  • Share this:
అసాధ్యం అనుకున్నవి సాధ్యమైనప్పుడు ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఆ మధుర క్షణాలను జీవితాంతం గుర్తుంచుకుంటారు. కలర్ బ్లైండ్‌నెస్ ఉన్న వ్యక్తి మొదటిసారి రంగులను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్న ఇలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ప్రత్యేకంగా తయారుచేసిన కళ్లజోడు సాయంతో మొదటిసారి రంగులను చూశాడు మెకన్లీ మ్యాక్ ఎర్వ్స్ (McKinley Mac Erves) అనే వ్యక్తి. దీంతో తన చుట్టూ ఇన్ని రకాల వర్ణాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోవడం అతడి వంతయ్యింది. ఈ కలర్ బ్లైండ్ గ్లాసెస్‌ను అతడి స్నేహితులు బహుమతిగా ఇచ్చారు. వాటి సాయంతో రంగులను చూసిన తరువాత ఎంతగానో ఆశ్చర్యపోయానని మ్యాక్ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో ఇది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. అతడి భావోద్వేగాలను అర్థం చేసుకున్న నెటిజన్లు మ్యాక్‌కు అభినందనలు తెలిపారు.

మెకన్లీ మ్యాక్ అనే 22సంవత్సరాల వ్యక్తికి కలర్ బ్లైండ్‌నెస్‌ ఉంది. దీంతో అతడు అన్ని రకాల రంగులను, రంగుల మధ్య తేడాలను గుర్తించలేడు. ఈ సమస్య గురించి తెలుసుకున్న మెక్ స్నేహితులు, అతడికోసం ప్రత్యేకంగా కలర్ బ్లైండ్ గ్లాసెస్ తయారు చేయించారు. తాజాగా దాన్ని అతడికి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ కళ్లజోడు పెట్టుకున్న తరువాత మొదటిసారి అన్ని రకాల రంగులను చూసి ఆశ్చర్యపోయినట్లు మెక్ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. ఆ సంతోషంలో అతడు కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు.


View this post on Instagram

A post shared by Mac (@maciavelli_)




లక్షలమంది చూశారు
ఈ అనుభవాన్ని వివరిస్తూ మ్యాక్ ఒక ఎమోషనల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అంతమంచి స్నేహితులు ఉండటం తన అదృష్టమని అతడు చెబుతున్నాడు. ట్విట్టర్లో ఈ వీడియోకు ఇప్పటివరకు రెండు మిలియన్ల వ్యూస్, పది లక్షలు లైక్స్ వచ్చాయి. మ్యాక్‌ను చూసి ఇంటర్నెట్ మొత్తం భావోద్వేగం చెందడంతో పాటు సంతోషంగా ఉందని ఒక వ్యక్తి దీనికి కామెంట్ పెట్టాడు. ఇప్పటి నుంచి ప్రపంచాన్ని కొత్త దృష్టితో చూడు మిత్రమా అంటూ మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు.
Published by:Hasaan Kandula
First published:January 09, 2021, 17:49 IST