ప్రపంచంలో అత్యంత పొట్టి వ్యక్తి... రెండోసారి రికార్డ్ బ్రేక్...

కొలంబియాకి చెందిన ఎడ్వార్డ్ రెండోసారి ప్రపంచంలో పొట్టి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఎలాగో తెలుసుకుందాం.

news18-telugu
Updated: May 13, 2020, 8:20 AM IST
ప్రపంచంలో అత్యంత పొట్టి వ్యక్తి... రెండోసారి రికార్డ్ బ్రేక్...
ప్రపంచంలో అత్యంత పొట్టి వ్యక్తి... రెండోసారి రికార్డ్ బ్రేక్... (credit - youtube)
  • Share this:
ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తిగా... ఎడ్వార్డ్ నినో హెర్నాండెజ్‌ను రెండోసారి గుర్తించింది గిన్నీస్ బుక్. ఇతని ఎత్తు 2 అడుగుల 4.39 అంగుళాలు మాత్రమే. 2010లో మొదటిసారి ఎడ్వార్డ్ ఈ గుర్తింపు పొందాడు. అప్పట్లో తిను... 3 అడుగుల 3.64 అంగుళాల ఎత్తు ఉండేవాడు. ఆ తర్వాత నేపాల్‌కి చెందిన ఖగేంద్ర తాపా మాగర్.... మరింత పొట్టిగా ఉండటంతో... ఎడ్వార్డ్‌ రికార్డును తాపా బ్రేక్ చేసినట్లైంది. 2010లోనే తాపా ఆ రికార్డును బ్రేక్ చేశాడు. తను 2 అడుగుల 2.41 అంగుళాళ ఎత్తు ఉండేవాడు. ఐతే... నేపాల్‌కే చెందిన చంద్ర బహదూర్ డాంగీ... మాగర్ కంటే పొట్టిగా 1 అడుగు 2.41 అంగుళాళ ఎత్తు ఉండేవాడు. ఫలితంగా మాగర్ నుంచి ఆ గుర్తింపు... చంద్ర బహదూర్ సొంతమైంది. ఇప్పుడు వాళ్లిద్దరూ జీవించి లేకపోవడంతో... పొట్టి వ్యక్తి రికార్డు మళ్లీ ఎడ్వార్డ్ సొంతమైంది.

మాగర్... 27 ఏళ్ల వయసులో జనవరిలో నిమోనియాతో చనిపోయాడు. తానెప్పుడూ పొట్టిగా ఉన్నట్లు ఫీలవ్వలేదన్న మాగర్... నిజానికి అదే తనను పెద్ద మనిషిని చేసిందనీ, తన ఫ్యామిలీకి ఓ ఇంటిని ఇచ్చిందని 2010లో గిన్నీస్ బుక్ వారికి తెలిపాడు.

తాజాగా బొగొటాలో... ఎడ్వార్డ్‌కి అధికారిక గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ ఇచ్చారు.

నవ్వే నా ఆయుధం అన్న ఎడ్వార్డ్... తాను ఏమేం సాధించాలనుకున్నాడో అన్నీ సాధించానన్నాడు. సైజ్, హైట్ మేటర్ కాదన్నారు. నేను చిన్నగా ఉన్నా... నా హృదయం పెద్దది అని గిన్నీస్ బుక్ వారికి తెలిపాడు. 1986లో పుట్టిన ఎడ్వార్డ్‌కి... 20 ఏళ్లప్పుడు హైపోథైరాడిజ్మ్ అనే వ్యాధి వచ్చింది. అయినప్పటికీ... వ్యాధికి తలవంచకుండా... నార్మల్ లైఫ్ కొనసాగిస్తున్నాడు.
Published by: Krishna Kumar N
First published: May 13, 2020, 8:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading