హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: పిల్లితో మాట్లాడుతున్న సీఎం యోగి ఆదిత్యనాథ్..వీడియో వైరల్

Viral Video: పిల్లితో మాట్లాడుతున్న సీఎం యోగి ఆదిత్యనాథ్..వీడియో వైరల్

పిల్లితో యోగి

పిల్లితో యోగి

Yogi Adityanath conversation with cat : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) కు మూగ జీవాలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Yogi Adityanath conversation with cat : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) కు మూగ జీవాలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆవులు అన్నా కుక్కలు అన్నా పిల్లులు అన్నా ఇలా మూగజీవాలు అంటే యోగి ఆదిత్యనాథ్ కు చెప్పలేని ఇస్టం అన్న సంగతి అనేక సందర్భాల్లో మనం కళ్లారా చూశాం. తాజాగా,సీఎం యోగి..ఓ పిల్లితో ముచ్చటిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోలో..యోగి ఆదిత్యనాథ్ సోఫాలో కూర్చున్న పిల్లిని ఏదో అడుగుతున్నారు(Yogi adithyanath conversation with cat).

క్యా కుచ్ ఖయేగీ?( ఏదైనా తినాలనుకుంటున్నావా) అని సీఎం యోగి ఆ పిల్లిని అడగడం వీడియోలో వినబడుతుంది. సోఫాలో కూర్చున్న పిల్లి యోగి నిశితంగా గమనిస్తుండగా అతను చాలాసార్లు ఇలా అడుగుతుండటం వీడియోలో కనబడుతుంది. ఈ వైరల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొందరు వ్యక్తులు.. యోగి ఆదిత్యనాథ్- పిల్లి మొదటి చూపులోనే ప్రేమలో పడ్డారని పేర్కొన్నారు. అదే సమయంలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు యోగి ఆదిత్యనాథ్ ను ప్రశంసిస్తున్నారు. జంతువులను కూడా చిన్న పిల్లలు లా చూసే మీరు గ్రేట్ సార్ అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

NCMC: ముంబై మెట్రో, లోకల్ ట్రైన్స్, బస్సుల్లో ప్రయాణాలకు కామన్ ట్రావెల్ స్మార్ట్ కార్డ్.. ఎలా పనిచేస్తుందంటే..

మరోవైపు,క్రూర మృగాలతో జాగ్రత్తగా ఉండాలి. మాంసం రుచి మరిగిన అవి.. మనుషులపై దాడి చేసేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ముఖ్యంగా జూలలోని ఎన్‌క్లోజర్లలో ఉన్న వాటికి.. స్వేచ్ఛ లేదనే కోపం బాగా ఉంటుంది. అందువల్ల ఛాన్స్ దొరికినప్పుడు దాడి చేయడానికి ఏమాత్రం వెనకాడవు. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లోని earth.reel పేజీలో ఈ వీడియోని జనవరి 16, 2023న అప్‌లోడ్ చేశారు. ఇప్పటివరకూ దీనికి 1400కి పైగా లైక్స్ వచ్చాయి. దీన్ని గమనిస్తే.. ఓ జూలో సింహాన్ని చూసేందుకు టూరిస్టులు వెళ్లారు. అక్కడ ఓ కుర్రాడు.. సింహం ఎన్‌క్లోజర్‌లో చెయ్యి దూర్చి.. సింహం జూలును ముట్టుకున్నాడు. వెంటనే సింహం.. అతని వేలును పట్టుకుంది. దాన్ని విడిపించుకునేందుకు అతను ఎంతగానో ప్రయత్నించాడు. ఆ సమయంలో ఇతర టూరిస్టులు.. తమ మొబైళ్లలో వీడియో రికార్డ్ చేశారే తప్ప.. అతన్ని కాపాడేందుకు ఏ ప్రయత్నమూ చెయ్యలేదు. చివరకు అతని వేలును సిహం లాగేసుకుంది.

First published:

Tags: Uttar pradesh, Viral Video, Yogi adityanath

ఉత్తమ కథలు