సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్..

KCR on Singareni : ఈ ఏడాది లాభాలా వాటాలో 28శాతం బోనస్‌గా అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఒక్కో కార్మికుడికి రూ.1,00,899 బోనస్ చెల్లిస్తామన్నారు.

news18-telugu
Updated: September 27, 2019, 11:21 AM IST
సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్..
సీఎం కేసీఆర్ (Source: Twitter)
  • Share this:
సింగరేణి కార్మికులు ఆశించినట్టుగానే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వారికి తీపి కబురు చెప్పారు.ఈ ఏడాది లాభాలా వాటాలో 28శాతం బోనస్‌గా అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఒక్కో కార్మికుడికి రూ.1,00,899 బోనస్ చెల్లిస్తామన్నారు. కార్మికులు గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.40,530 అదనంగా పొందనున్నారు.
ఇక సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ.. శ్రీరాంసాగర్ ఆయకట్టు ప్రస్తుతం 7లక్షల ఎకరాలు ఉందని.. అక్కడి రైతులు నిశ్చితంగా ఉండవచ్చునని చెప్పారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పెంచాలన్న డిమాండ్‌ వినిపిస్తోందని.. పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టామని చెప్పారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని.. పోలీసులకు వీక్లీ ఆఫ్ డిమాండ్‌పై డీజీపీ,ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామని అన్నారు. డిసెంబర్,జనవరికల్లా కమాండ్ కంట్రోల్ పూర్తి అవుతుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో హోంగార్డులకు అధిక వేతనాలు ఇస్తున్నామని చెప్పారు.
First published: September 19, 2019, 12:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading