Home /News /trending /

CLICK SEND AND WIN CLICKING PICTURES OF ILLEGALLY PARKED CARS CAN GET YOU REWARDS SAYS NITIN GADHKARI PAH

జనాలకు గుడ్ న్యూస్.. రాంగ్ పార్కింగ్ లో ఉన్న వెహికిల్ ఫోటోలు పంపిన వారికి రివార్డు.. ఎంతో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delhi: రోడ్లపై ఇక మీదట ఇష్టమోచ్చినట్లు పార్కింగ్ చేస్తానంటే కుదరదు. ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసులు అక్రమంగా పార్కింగ్ చేసిన వారిని అదుపు చేసేవారు. వాహానాలకు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చలానాలు వేసేవారు.

కొందరు రోడ్లపై ఇష్టా రాజ్యంగా ప్రవర్తిస్తుంటారు. తమ వెహికిల్స్ ను (Vehicle)  ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తుంటారు. రోడ్లపై రాంగ్ రూట్ లో వెళ్తుంటారు. సిగ్నళ్లను అసలు పట్టించుకోరు. అధికారుల వాహానాన్ని ఆపాలని చూస్తే.. వారిపైనే తిరగబడతారు. కొందరు పరిమితికి మించి ఎక్కువ వేగంతో వెహికిల్స్ ను నడిపిస్తుంటారు. చలాన్లను తప్పించుకొని తిరుగుతుంటారు. ఈ క్రమంలో కొందరు తాగి వాహానాలను నడిపిస్తుంటారు. వేగంగా వెళుతు ప్రమాదాలకు కారణమవుతుంటారు.

అయితే, ప్రభుత్వాలు రోడ్డు భద్రత నియమాలు (Road safety rules)  పాటించాలని అనేక చట్టాలు తీసుకొచ్చాయి. అదే విధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా నిబంధలను పాటించాలని తరచుగా సూచిస్తుంటారు. కానీ వాహాన దారులు మాత్రం పెడచేవిన పెడుతుంటారు. అయితే, అన్ని చోట్ల ట్రాఫిక్ ను (Traffic) కట్టడి చేయడానికి కొన్ని సార్లు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. దీని కోసం తొందరలోనే కొత్త చట్టం తీసుకురావడానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తుంది.



పూర్తి వివరాలు.. కేంద్ర రోడ్డు, రవాణా, రహాదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadhkari)  తొందరలోనే ఒక కొత్త చట్టాం తీసుకురానున్నట్లు గురువారం తెలిపారు. దీని ప్రకారం.. రోడ్లపై అక్రమంగా పార్కింగ్  (Parking) చేసిన వెహికిల్స్ ను ఫోటో తీసి, సంబంధిత శాఖ వెబ్ పోర్టల్ లేదా ఫోన్ నంబర్ కు వాట్సప్ పంపాలని అన్నారు. దీంతో వారు.. అక్రమంగా పార్కింగ్ చేసిన వారికి జరిమాన విధించడంతో పాటు.. ఫోటో పంపిన వారికి 500 రూపాయల రివార్డును ( Get You Rewards) కూడా పంపుతామని అన్నారు. ప్రస్తుతం ఈ చట్టం గురించి ఆలోచిస్తున్నామని, తొందరలోనే దీనిపై ఒక క్లారిటీ వస్తుందని అన్నారు. దీనితో అక్రమంగా పార్కింగ్ ల సంఖ్య తగ్గుతుందని అన్నారు. అదే విధంగా ట్రాఫిక్ జామ్ కు ఫుల్ స్టాప్ పెట్టోచ్చని నితిన్ గడ్కరీ అన్నారు.

ఇదిలా ఉండగా .. మధ్యప్రదేశ్ (Madhya pradesh) మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి (Uma bharti) మరోమారు వార్తలలో నిలిచారు.

ఆమె ఒక మద్యం దుకాణంపై దాడిచేసి వార్తలో నిలిచారు. కాగా, భోపాల్ 330 కిలోమీటర్ల దూరంలో ఉన్నఓర్చాలోని రామరాజ ఆలయానికి ఉమాభారతి వెళ్లారు. అక్కడ ఆలయానికి దగ్గరలో మద్యం దుకాణం ఉండటాన్ని ఆమె గమనించారు. వెంటనే ఆమె ఆగ్రహంతో ఊగిపోయారు.

వెంటనే తన అనుచరులతో కలిసి మద్యం దుకాణం దగ్గరకు వెళ్లారు. పేడ ముద్దలను తీసుకుని, వైన్ షాపుపై విసిరారు. ఆ తర్వాత.. దుకాణం మూసివేయాలని హెచ్చరించారు. అదే విధంగా, తాను రాళ్లను విసరలేదని, కేవలం ఆవు పేడ (Cow Dung At Liquor Shop) మాత్రమే విసిరి నిరసన తెలిపానని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట  (Social media) వైరల్ గా మారింది. కాగా, గతంలోనే ఉమా భారతి ఇలానే మద్యం దుకాణాలపై దాడిచేసి వార్తలలో నిలిచారు. ఇప్పుడు మరోసారి వైన్ షాపై దాడిచేసి ట్రెండింగ్ లో నిలిచారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, Nitin Gadkari, Photos, Road safety

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు