బట్టలు ఉతికిన చింపాంజీ... వైరల్ వీడియో...

కొన్నిసార్లు జంతువులు మనం చేసే పనులను చూసి అవీ అదే పని చేస్తాయి. వాటికి అంత మైండ్ థింకింగ్ ఎలా వస్తుందన్నది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ చింపాంజీ వీడియో అందుకే వైరల్ అయ్యింది.

news18-telugu
Updated: December 8, 2019, 11:43 AM IST
బట్టలు ఉతికిన చింపాంజీ... వైరల్ వీడియో...
బట్టలు ఉతికిన చింపాంజీ... వైరల్ వీడియో... (credit - insta - SocialViralTogo)
  • Share this:
మనుషులకూ, చింపాంజీలకూ చాలా సందర్భాల్లో పోలికలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది. మనకి లాగే... వాటికీ కోపం వచ్చినప్పుడు ఫైర్ అవుతాయి. గట్టిగా అరుస్తాయి. గుంపులుగా ఉంటాయి. ఇలా చాలా ఉంటాయి. సరే ఇప్పుడు మేటరేంటంటే... చైనా జూలోని 18 ఏళ్ల యూహూ చింపాంజీ... బట్టలు ఉతికి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తన కీపర్ బట్టలు ఉతకడాన్ని చూసిన ఆ చింపాంజీ... "ఓస్ ఈ మాత్రం పని నేను చెయ్యాలేనా" అనుకుంది. లేహే లేడు థీమ్ పార్కులో ఉండే ఆ చింపాంజీ... ఏకంగా 30 నిమిషాలపాటూ బట్టలు ఉతికింది. తన కీపర్ (సంరక్షకుడు) టీ-షర్టును సోప్ బార్, బ్రష్ వాడి ఉతికింది. అంతే... ఆ వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది. వైరల్ అయ్యింది. ఇదివరకు కొన్ని కొన్నింటిని ఇలాగే కాపీ కొట్టిన ఆ చింపాంజీ... బట్టలు కూడా ఉతుకుతుందేమో చూద్దామని దాని కోసం తన టీ షర్ట్, సబ్బు, బ్రష్‌ని అక్కడ వదిలాడు ఎకన్స్. ఆల్రెడీ ఇదివరకు చాలాసార్లు అతను బట్టలు ఉతకడాన్ని చూసిన చింపాంజీ... తాజాగా ఎకన్స్ ఉతుకుతున్నప్పుడు తదేకంగా ఎక్కువ సేపు చూసింది. అందుకే అతను ఈ ట్రయల్ వేసి చూశాడు. ఎకన్స్ అనుకున్నట్లే చేసి... శభాష్ అనిపించుకుంది. ఈ చింపూ... మనుషులు ఎలాగైతే... తమ చేతులతో హార్ట్ షేప్ చూపిస్తారే... అలాగే చూపించగలదట. ఒకే కాలుపై నిల్చోగలదట. 

Pics : క్యూట్ సింగర్ షిర్లీ సెషియా అందాలు


ఇవి కూడా చదవండి :

తొలిసారి అమ్మమాటలు విన్న చిన్నారి రియాక్షన్ ఇదీ... వైరల్ వీడియోFD : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల మార్పు... ఏ బ్యాంకులో ఎంతంటే...

పెళ్లికొడుకును బంధించి... మరొకరిని పెళ్లి చేసుకున్న వధువు

ఇంటర్నెట్‌లో టీచర్ నగ్న చిత్రాలు... ఎలా వచ్చాయ్?

నిత్యానంద వీడియో రిలీజ్... పిచ్చి పీక్ స్టేజ్‌కి చేరిందిగా...
First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు