Home /News /trending /

CLASS 9 STUDENT HOPPING TO SCHOOL ON ONE LEG TO PURSUE HIS STUDIES PVN

Viral : నీ సంకల్పానికి హ్యాట్సాఫ్..ఒంటికాలితో గెంతుతూ స్కూల్ కి బాలుడు

ఒంటికాలితో గెంతుతూ స్కూల్ కి బాలుడు

ఒంటికాలితో గెంతుతూ స్కూల్ కి బాలుడు

Boy With 1 Leg Walks 2 km To School : సంకల్పమే కారుచీకట్లను బద్దలు కొడుతుంది.పేదల జీవితాలకు చదువు మాత్రమే వెలుగుదారులు పరుస్తుంది. జమ్మూకశ్మీర్(Jammu Kashmir)కి చెందిన ఓ బాలుడికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. అతడి మొక్కవోని సంకల్పం ముందు వైకల్యం చిన్నబోయింది.

ఇంకా చదవండి ...
Boy With 1 Leg Walks 2 km To School : సంకల్పమే కారుచీకట్లను బద్దలు కొడుతుంది.పేదల జీవితాలకు చదువు మాత్రమే వెలుగుదారులు పరుస్తుంది. జమ్మూకశ్మీర్(Jammu Kashmir)కి చెందిన ఓ బాలుడికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. అతడి మొక్కవోని సంకల్పం ముందు వైకల్యం చిన్నబోయింది. ప్రమాదంలో కాలు కోల్పోయినా నిరాశ చెందకుండా తాను అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నాడు. చదువుకోవడానికి అనేక కిలోమీటర్ల దూరం ప్రయాణించి పాఠశాలకు చేరుకుంటున్నాడు. అన్ని అవయవాలు ఉన్న చదువును అశ్రద్ధ చేస్తున్న నేటి సమాజంలో.. చదువుకోవాలనే తపనతో ఒంటి కాలుతోనే పాఠశాలకు వెళుతున్న అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

జమ్ముకశ్మీర్​ కుప్వారా జిల్లాలోని హంద్వారాకు చెందిన మహ్మద్​ పర్వేజ్​ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. 2009లో జరిగిన ప్రమాదంలో మహ్మద్​ పర్వేజ్ కాలు కోల్పోయాడు. అనేక శస్త్ర చికిత్సలు చేసినా..ప్రయోజనం లేదు. చివరకు పర్వేజ్​ కాలును తొలగించారు వైద్యులు. దీంతో అప్పటినుంచి ఒంటికాలితోనే జీవిస్తున్నాడు. ప్రమాదంలో కాలు కోల్పోయినా నిరాశ పడకుండా తాను అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నాడు. ఒక్క కాలితోనే గెంతుకుంటూ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు నడిచి వెళుతున్నాడు. తనకు ప్రభుత్వం వీల్​చైర్​ను ఇచ్చినా తమ గ్రామంలోని రోడ్డుపై నడిచే పరిస్థితి లేదని...అందుకే నడిచి వస్తున్నాని పర్వేజ్ చెప్పాడు. చదడమే కాకుండా తన మిత్రులతో కలిసి క్రికెట్​, వాలీబాల్​ లాంటి క్రీడలన్నీ ఆడుతున్నాడు పర్వేజ్. భవిష్యత్తులో డాక్టర్​ అయ్యి తమ గ్రామానికి మంచి పేరు తెస్తానని పర్వేజ్ చెప్పాడు.

ALSO READ Flight Missing : బిగ్ బ్రేకింగ్..విమానం ఆచూకీ గల్లంతు

పర్వేజ్​ కు కృత్రిమ కాలు అమర్చే ఆర్థిక స్తోమత తన వద్ద లేదని అతడి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పర్వేజ్​కు చదువుకోవడం అంటే ఇష్టమని.. అందుకే ఎన్ని సమస్యలు ఎదురైనా రోజు పాఠశాలకు వెళతాడని అతడి తండ్రి తెలిపాడు. దయనీయ పరిస్థితుల్లో ఉన్న తనను ప్రభుత్వమే ఆదుకోవాలని పర్వేజ్​ విజ్ఞప్తి చేస్తున్నాడు.

మరోవైపు, అచ్చం ఇలానే ఒంటికాలితో గెంతుకుంటూ స్కూల్​కు వెళుతూ వైరల్​గా మారిన బాలికకు కృతిమ కాలును అమర్చారు. బిహార్ జముయీ జిల్లా ఖైరా బ్లాక్​లోని ఫతేపుర్ గ్రామంలో ఉండే సీమాకు రెండేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో కాలు కోల్పోయింది. రెండేళ్ల క్రితం తన తండ్రికి ఆహారం ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో సీమా ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్ ఢీకొట్టడంతో రెండు కాళ్లలో ఒక కాలును కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ సీమ కుంగిపోలేదు. దివ్యాంగురాలిననే భావన దరిచేరకుండా సొంతంగా తన పనులు చేసుకోవడం ప్రారంభించింది. క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లేది. ఎవరికీ భారం కాకూడదని ఒంటికాలితో గెంతుకుంటూనే స్కూల్​కు వెళ్తోంది. ఒంటికాలితోనే నిత్యం 1 కి.మీ దూరం గెంతుకుంటూ స్కూల్‌కు వెళ్తోంది.

ఇటీవల సీమా స్కూల్‌కు వెళ్తున్న వీడియోను ఎవరో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. సీమ వీడియో చూసిన నెటిజన్లు ఆమె సంకల్పానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. సీమా గురించిన కథనాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, వైద్య శాఖ స్పందించింది. అధికారులు వచ్చి సీమా కాలిని పరిశీలించారు. ఆమెకు కృత్రిమ కాళ్లను అమర్చాలని నిర్ణయించారు. అనేక మంది దాతలు కూడా స్పందించారు. తాజాగా బిహార్​ ఎడ్యూకేషన్​ ప్రాజెక్ట్​ కౌన్సిల్​ సీమాకు కృతిమ కాలును కానుకగా ఇచ్చింది. కృతిమ కాలు అమర్చడం వల్ల ఆమె నడుస్తూ పాఠశాలకు వెళ్లనుంది. తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది సీమా.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Jammu and Kashmir, Viral

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు