CHRISTMAS 2021 WHY DO WE SAY MERRY CHRISTMAS AND NOT HAPPY CHRISTMAS GH VB
Christmas Wishes: క్రిస్మస్ సందర్భంగా 'మేరీ క్రిస్మస్' అని ఎందుకు విష్ చేస్తారు?.. 'హ్యాపీ క్రిస్మస్' అని ఎందుకు చెప్పరు..?
ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో 'మేరీ క్రిస్మస్' అని శుభాకాంక్షలు తెలుపుతున్నపటికీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో "హ్యాపీ క్రిస్మస్" శుభాకాంక్షలు పూర్తిగా కనుమరుగు కాలేదు. ఇంగ్లాండ్‌లోని ప్రజలు మేరీ క్రిస్మస్ బదులు హ్యాపీ క్రిస్మస్ అని చెబుతుంటారు.
ప్రజల్లో ఆనందం, ఉత్సాహం, భక్తి ఒకేసారి తీసుకొచ్చే పండగల్లో క్రిస్మస్ ఒకటి. క్రిస్మస్ పర్వదినాన హ్యాపీ క్రిస్మస్ అని శుభాకాంక్షలు తెలపకుండా మేరీ క్రిస్మస్ (Christmas) అని విషెస్ తెలుపుతుంటారు. సాధారణంగా ఏ ఇతర పండగ పేరు ముందైనా మనం హ్యాపీ అనే పదం జోడించి విషెస్ తెలుపుతాం. కానీ ఒక క్రిస్మస్ విషయంలోనే ఇలా ఎందుకు చెప్తాం? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో 'మేరీ క్రిస్మస్' అని శుభాకాంక్షలు తెలుపుతున్నపటికీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో "హ్యాపీ క్రిస్మస్" శుభాకాంక్షలు పూర్తిగా కనుమరుగు కాలేదు. ఇంగ్లాండ్‌లోని ప్రజలు మేరీ క్రిస్మస్ బదులు హ్యాపీ క్రిస్మస్ అని చెబుతుంటారు. దీనికి కారణం ఎలిజబెత్ రాణి ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న బ్రిటీష్ ప్రజలకు "హ్యాపీ క్రిస్మస్" అని శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇలా చెప్పడం వల్ల వెనుకబడిన ప్రజలు మాత్రమే 'మేరీ క్రిస్మస్' అని విషెస్ చెబుతారనే భావన ప్రజల్లోకి వెళ్లిపోయింది.
అందుకే అక్కడి ప్రజలు రాయల్ ఫ్యామిలీ చెప్పినట్లుగా హ్యాపీ క్రిస్మస్ అని చెబుతారు. ఎలిజబెత్ రాణి మేరీ అనే పదాన్ని ఒక అరుపుగా.. గోలతో చేసుకునే సంబరంగా భావిస్తారట. అలాగే ఆమె మేరీ(Mary) అనే పదం మత్తు, నిషాతో కూడినదిగా అనుకుంటారు. అందుకే ఈ పదాన్ని ఉపయోగించకుండా హ్యాపీ పదాన్ని ఉపయోగించడానికి ఆమె ఇష్టపడతారని పలువురు చెబుతుంటారు.
మేరీ (merry-ఉల్లాసము) అనేది అట్టడుగు వర్గాల వారితో ముడిపడి ఉందని మరికొందరు నమ్ముతారు. అయితే "హ్యాపీ" అనేది ఉన్నత తరగతి అర్థాన్ని సంతరించుకుంది. ఎందుకంటే ముందుగా చెప్పుకున్నట్లు రాజకుటుంబం ఇష్టపడే గ్రీటింగ్ కూడా "హ్యాపీ క్రిస్మస్". మరోవైపు గ్రేట్ బ్రిటన్‌లోని చర్చి లీడర్లు క్రైస్తవ మతస్తులకు "merry-making" అనే స్వేచ్ఛమైన ఉల్లాస వేడుకల్లో పాల్గొనకుండా సంతోషంగా ఉండమని విషెస్ తెలుపుతారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా పండుగ చేసుకోండి అని తెలపకుండా.. దయామూర్తి యేసుక్రీస్తు జన్మించిన రోజున సంతోషంగా ఉండండి అని తెలియజేయడానికే హ్యాపీ క్రిస్మస్ చెబుతారని కొందరు నమ్ముతారు.
ఏది ఏమైనప్పటికీ 'మేరీ క్రిస్మస్' అనేది శతాబ్దాలుగా వాడుకలో ఉన్న సంప్రదాయ శుభాకాంక్షలు. మరింత భావోద్వేగంగా, విచ్చలవిడిగా వేడుకలను జరుపుకోండి అని చెప్పడానికే 'మేరీ క్రిస్మస్' శతాబ్దాలుగా వాడుతున్నారు. ఐతే ఇలా కాకుండా కాస్త హుందాగా, ఆనందంగా, అంతర్గత భావోద్వేగ స్థితితో పండగ చేసుకోండని చెప్పడానికి హ్యాపీ క్రిస్మస్ అనే విషెస్‌ని కొందరు తీసుకొచ్చారు. ఈ రెండు శుభాకాంక్షలకు మధ్య కేవలం భాషాపరమైన వ్యత్యాసాలు మాత్రమే ఉన్నాయని క్రైస్తవులు నమ్ముతుంటారు. మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడం అనేది 1534లోనే జరిగింది. లండన్ బిషప్ జాన్ ఫిషర్ హెన్రీ VIII.. ముఖ్యమంత్రి థామస్ క్రోమ్‌వెల్‌కు రాసిన లేఖలో "మేరీ క్రిస్మస్" అని పేర్కొన్నారు. ఈ లేఖ 1534 నాటిది.
16వ శతాబ్దపు ఆంగ్ల కరోల్ "వి విష్ యు ఎ మేరీ క్రిస్మస్" అనే పదబంధాన్ని ఉపయోగించారు. దాంతో ఈ శుభాకాంక్షలకు హైప్ పెరిగింది. 1843లో చార్లెస్ డికెన్స్ 'ఎ క్రిస్మస్ కరోల్' అనే పేరుతో నవల ప్రచురించారు. అప్పట్లో కూడా మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఊపందుకున్నాయి. మేరీ క్రిస్మస్ ఆ ఏడాది కమర్షియల్ గా విక్రయించిన మొదటి క్రిస్మస్ కార్డ్‌లో కూడా కనిపించింది.
విక్టోరియన్ క్రిస్మస్ నేటి అనేక క్రిస్మస్ సంప్రదాయాలను పోలి ఉంది కాబట్టి "మేరీ క్రిస్మస్" అనేది క్రిస్మస్ పాటలు, కథలలో నిలిచిపోయింది. అలాగే చాలామంది ప్రజలు మేరీ క్రిస్మస్ అనే శుభాకాంక్షలు చెబుతుంటారు. భారతదేశంలో కూడా మేరీ క్రిస్మస్ అంటూ పాటలు పాడుతుంటారు. ఐతే మేరీ క్రిస్మస్ విషెస్ యూఎస్ లో ఎక్కువగా వాడుకలో ఉంది. హ్యాపీ క్రిస్మస్ అనేది యూకేలో చాలా మంది ఇష్టపడే విషెస్. కాలక్రమేణా ఈ రెండు పదాలు పరిణామం చెందాయి. అలాగే వాటి అర్థాలూ మారాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.