చిన్ని చిన్ని ఆశ... మట్టే వాళ్లకు జారుడు బల్ల... జోరుగా వైరల్ అవుతున్న వీడియో...

ఆ వీడియో చూసిన వాళ్లంతా... తమ చిన్న నాటి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటున్నారు. చెరువు గట్టు దగ్గర ఎంత ఎంజాయ్ చేశారో చెబుతున్నారు.

news18-telugu
Updated: July 7, 2020, 1:31 PM IST
చిన్ని చిన్ని ఆశ... మట్టే వాళ్లకు జారుడు బల్ల... జోరుగా వైరల్ అవుతున్న వీడియో...
చిన్ని చిన్ని ఆశ... మట్టే వాళ్లకు జారుడు బల్ల... జోరుగా వైరల్ అవుతున్న వీడియో... (credit - twitter)
  • Share this:
మీరు చిన్నప్పుడు చెరువు గట్టు దగ్గర ఆడుకున్నారా... అయితే మీకు ఈ వీడియో తెగ నచ్చేస్తుంది. ఎందుకంటే... ఇందులో... ఇంకా ప్రపంచ పోకడ తెలియని చిన్నారులు... ఈ కరోనా, ఈ సమస్యలూ అన్ని మర్చిపోయి... మట్టిలో జారుడుబల్లలా జారుతూ... అలా చెరువులో గెంతుతున్నారు. అలా ఆడుకుంటున్నప్పుడు వాళ్ల ఆనందానికి అవధుల్లేవు. వాళ్ల ముఖాలు... లెడ్ లైట్లలా వెలుగుతున్నాయి. చెరగని నవ్వు... ఎంజాయ్ అంటోంది. ఇలాంటివి ఎన్నో మన చిన్నప్పుడు మనం ఆడినవే. ఇప్పుడైతే... మొబైళ్లు, కంప్యూటర్లూ వచ్చేయడంతో... పిల్లలు అపార్ట్‌మెంట్లను దాటి బయటకు రావట్లేదు. ఈ వీడియోలో పిల్లలు మాత్రం... ప్రపంచాన్ని మర్చిపోయి... తమ ఆటలో మునిగిపోయారు.

ట్విట్టర్ యూజర్ మనోజ్ కుమార్...ఈ వీడియోని పోస్ట్ చేశారు. ఆ పిల్లలు మట్టిలో జారే టప్పుడు... గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. బట్టలు కూడా చిరుగుతాయి. అయినప్పటికీ... వాళ్లు అవేవీ పట్టించుకోవట్లేదు. పార్కుల్లో జారుడు బండలాగా... నేలను చదునుగా చేసుకొని... చక్కగా ఆడేసుకుంటున్నారు.


ఈ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా దీన్ని తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. నెటిజన్లకు ఇది బాగా నచ్చుతోంది. ఇప్పటికే... దీన్ని 3.14 లక్షల మంది చూశారు. 9వేల మందికి పైగా లైక్ చేశారు. 2 వేల మందికి పైగా రీట్వీట్ చేశారు. ఇక కామెంట్లు వస్తూనే ఉన్నాయి. ఆ ఆట పిల్లలకు స్వర్గమే అని ఓ నెటిజన్ అభిప్రాయపడగా... ఈ వీడియో చూశాక... చాలా ఆనందం వేసిందని మరికొందరు తెలిపారు.
Published by: Krishna Kumar N
First published: July 7, 2020, 1:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading