హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

‘ఓరి వెధవా.. బాయ్ ఫ్రెండ్ వై ఉండి ఇదేం చెత్త పని..’ తిట్టిపోస్తున్న నెటిజన్లు.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

‘ఓరి వెధవా.. బాయ్ ఫ్రెండ్ వై ఉండి ఇదేం చెత్త పని..’ తిట్టిపోస్తున్న నెటిజన్లు.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

లవర్ ను చీటింగ్ చేసిన ప్రియుడు

లవర్ ను చీటింగ్ చేసిన ప్రియుడు

Viral Video: అమ్మాయి రోడ్డుమీద ఫోన్ లో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది. ఇంతలో స్కూటీమీద ఫాస్ట్ గా ఒక ఆగంతకుడు వచ్చాడు. అతను ముఖం కన్పించకుండా మాస్క్ వేసుకున్నాడు. ఒక్కసారిగా ఆమెచేతిలోని ఫోన్ ను లాక్కున్నాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Haryana, India

మనలో చాలా మంది ప్రేమించి, పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ప్రేమ వివాహాల్లో ఒకర్నిమరోకరు అర్థం చేసుకొవడానిక వీలుంటుంది. ఇద్దరు కలిసి జర్నీ చేస్తుంటారు. తమ భావాలను ఒకరితో మరోకరు షేర్ చేసుకుంటారు. ఒకవేళ నచ్చకపోతే.. బ్రేకప్ చెప్పుకుంటారు. మరికొందరు మాత్రం తమ అవసరాల కోసం ప్రేమను పావుగా ఉపయోగించుకుంటారు. ఎదుటివారి బలహీనతలను ఆసరాగా చేసుకుని ప్రేమిస్తున్నట్లు నటిస్తుంటారు. తమ అవసరాల కోసం ప్రేమను వాడుకుంటారు. తీరా అవసరాలు ఐపోయాక.. అవాయిడ్ చేయడం, బ్రేకప్ చేయడం చేస్తుంటారు. మరికొందరు మాత్రం ఒకరికి తెలియకుండా, మరికొందరితో ప్రేమయాణాలు నడిపిస్తుంటారు. కొందరు ప్రేమించిన వారిని మోసం చేయటానికి సైతం వెనుకాడరు. ఇలాంటి అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. మరోక ఘటన వెలుగులోనికి వచ్చింది.


పూర్తి వివరాలు.. అమ్మాయి రోడ్డు మీద బ్యాగ్ వేసుకుని వెళ్తుంది. అప్పుడు ఒక ఆగంతకుడు ముఖం కన్పించకుండా.. వచ్చి ఆమె దగ్గర ఆగాడు. ఆమె తలపై ఒక్కటేసి.. చేతిలోని ఫోన్ ను లాక్కొని, కిందకు తోసేశాడు. దీంతో ఆమె షాక్ నకు గురైంది. వెంటనే కాపాడండి అని అరిచింది. ఈ క్రమంలో అక్కడున్నవారు,వెంటనే ఆగంతకుడికి వెంబడించారు.అతడిని పట్టుకుని, ఆమె దగ్గరకు తీసుకెళ్లారు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. ఆ ఆగంతకుడు.. తన బాయ్ ఫ్రెండ్ అని తెలిసి యువతి షాక్ నకు గురైంది. ఇదేంపాడుపని అంటూ అతడిని తిట్టిపోసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. వోర్నీ.. నువ్వేందిరా బాబు.. అమ్మాయిని ఇలా మోసం చేశావంటూ కామెంట్ లు పెడుతున్నారు.


ఇదిలా ఉండగా దొంగ, పోలీసులకు ఒక రేంజ్ లో చుక్కలు చూపించాడు.


పూర్తి వివరాలు.. ఒక దొంగను పోలీసులు జీప్ లో ఛేజింగ్ చేస్తున్నారు. అతను స్కూటీపై ధూమ్ స్టైల్ లో చక్మా ఇచ్చాడు. అంతే కాకుండా.. పోలీసులకు దొరక్కుండా స్కూటీ మీద కట్స్ కొడుతూ ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు అతగాడు ఒక వంపు మార్గం రాగానే దానిలోపలికి పొనిచ్చాడు. అప్పుడు.. దిమ్మ తిరిగే ఘటన జరిగింది. స్కూటీ మీద ప్రయాణిస్తున్న దొంగ.. మరో మార్గంలోనికి పొనిచ్చాడు. అప్పుడు.. అతనికి ఎదురుగా ఒక సుమో వాహనం ఆగి ఉంది.


అతను వేగంగా వెళ్లి.. వెహికిల్ వెనుక నుంచి యూటర్న్ చేసుకుని వచ్చిన మార్గం గుండా తిరిగి వెళ్లిపోయాడు. పాపం.. పోలీసులు స్కూటీ అంత వేగంగా తమ వాహనం టర్న్ చేయలేక అక్కడే ఉండిపోయారు. అంతే కాకుండా.. పోలీసులు వెహికిల్ దిగి.. అతగాడి కోసం వెనుకవైపుకు వచ్చి మరీ చూశారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు (Netizens) ఇదేం తెలివిరా నాయన అంటూ కామెంట్ లు పెడుతున్నారు. మరికొందరు వీడిది మాములు బుర్రకాదంటూ నవ్వుతూ ఎమోజీలను పెడుతున్నారు.First published:

Tags: Lover cheating, Viral Video

ఉత్తమ కథలు