Viral Video: చాక్లెట్ బిర్యానీ తింటూ వింత హావభావాలు.. కామెంట్స్‌తో అదరగొడుతున్న నెటిజన్లు..

(Image Credit- Youtube)

ప్రస్తుత కాలంలో అన్నీ వింత కాంబినేషన్ల ఫుడ్స్ ప్రయత్నించడం కామన్‌గా మారిపోయింది. చాలామంది వాటిని అసహ్యించుకుంటున్నా.. అలాంటి వీడియోలు మాత్రం వైరల్‌గా మార్చడం మనం చూశాం.

  • Share this:
సాధారణంగా మనం వివిధ టీవీ ఛానళ్లలో వంటల ప్రోగ్రాంలు చూసేటప్పుడు మనందరికీ ఒక కామన్ డౌట్ వస్తుంటుంది. అక్కడ తయారుచేసిన పదార్థం ఎప్పుడూ బాగుంటుందా? లేక అది ఎలా ఉన్న యాంకర్లు బాగుందని చెబుతారా? అని.. చాలామంది రెండోదే నిజమని చెప్పడం సహజం. ఆ యాంకర్ల హావభావాలు చూస్తుంటే అది ఎంత రుచిగా ఉందో.. మనం కూడా తింటే బాగుండు.. అనిపిస్తుంటుంది. కానీ వాళ్లు తినేది దరిద్రంగా ఉన్నా కూడా ఇలాంటి హావభావాలు చూస్తే ఓవర్ యాక్టింగ్ అనక మానరు. ప్రస్తుతం పాకిస్థాన్‌కు చెందిన ఓ ఫుడ్ ఛానల్ పెట్టిన వీడియోను చూసిన ప్రతి ఒక్కరు ఇలాంటి కామెంట్లే చేస్తున్నారు.

ప్రస్తుత కాలంలో అన్నీ వింత కాంబినేషన్ల ఫుడ్స్ ప్రయత్నించడం కామన్‌గా మారిపోయింది. చాలామంది వాటిని అసహ్యించుకుంటున్నా.. అలాంటి వీడియోలు మాత్రం వైరల్‌గా మార్చడం మనం చూశాం. ఓ కాంబినేషన్ ఫుడ్‌కి సంబంధించిన తాజా వీడియో ఒకటి ఇదే కోవలోకి వస్తుంది. ఇందులో ఉన్న ఫుడ్ ఇంకేదో కాదు.. చాక్లెట్ బిర్యానీ. చాక్లెట్, బిర్యానీ రెండూ విడివిడిగా చాలామంది ఇష్టపడతారు. కానీ ఈ రెండింటిని కలిపే ప్రయత్నం చేసింది పాకిస్థాన్ కరాచీలోని ఆర్‌సీబీ అనే ఫుడ్ స్టాల్. ఓ యూట్యూబర్ దీన్ని కొనుగోలు చేసి తిన్నాడు కూడా. అంతే కాదు.. ‘మీరు ఇది తినకపోతే ఇంక మీరు రుచికరమైనదేదీ తిననట్లే. ఎంతో బాగుంది. ఇది చేసిన చెఫ్ ఎవరు? అతడి చేతులు ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నా’ అని కూడా చెప్పడం విశేషం.



ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో వైరల్‌గా మారింది. నిమిషాల్లోనే వేల వ్యూస్ సంపాదించింది. అయితే ఇదంతా ఈ బిర్యానీ రుచి నచ్చి అనుకుంటే మాత్రం పొరపాటే.. ఆ వింత కాంబినేషన్ పై వింతైన కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కొందరు ఆ యూట్యూబర్ యాక్టింగ్‌ను.. ఆస్కార్ విన్నింగ్ యాక్టింగ్ అంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా విసురుతున్నారు. మరికొందరేమో.. ‘చాక్లెట్ బిర్యానీయా.. మీకు తయారుచేయడానికి ఏ కొత్త కాంబినేషనే దొరకలేదా? ఇంకొన్ని రోజులకు ఐస్ క్రీం పులావ్ చేస్తారేమో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ స్టాల్ పేరు ఆర్‌సీబీ కావడంతో ఆ ఐపీఎల్ జట్టు ఇంతవరకు ఒక్క విజయం కూడా సాధించలేకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. తాజా మిక్స్‌డ్ బిర్యానీ సైతం అలాగే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.
Published by:Sumanth Kanukula
First published: