హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Live Video: చిరుత దాడి.. భయంకరంగా చంపేసింది.. పీక్కుని, లాక్కెళ్లింది

Live Video: చిరుత దాడి.. భయంకరంగా చంపేసింది.. పీక్కుని, లాక్కెళ్లింది

(ప్రతీకాత్మక చిత్రం) Image credit : twitter

(ప్రతీకాత్మక చిత్రం) Image credit : twitter

ఇటీవల కాలంలో చిరుత పులులు, పులులు దాడి చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరిని చంపింది పులి. దీంతో ప్రజలు హడలిపోతున్నారు.

ఇటీవల కాలంలో చిరుత పులులు, పులులు దాడి చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరిని చంపింది పులి. దీంతో ప్రజలు హడలిపోతున్నారు. ఇది తెలంగాణలోనే కాదు. మహారాష్ట్రలో కూడా జరుగుతోంది. నాసిక్‌లో ఓ చిరుతపులి దాడి చేసింది. ఓ కుక్కమీద దాడి చేసి భయంకరంగా చంపేసింది. ఇగట్ పురి గ్రామంలో ఓ కొట్టేసిన చెట్టు మొదలుకు కుక్కను కట్టేశారు. ఆ ప్రాంతానికి చిరుత వచ్చింది. చిరుతను చూసి ఆ కుక్క గట్టి గట్టిగా అరిచింది. దీంతో ఆ చిరుత ఒక్క ఉదుటున ఆ కుక్కను చంపేసింది. అయితే, ఆ తర్వాత ఆ చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది. మళ్లీ కొంతసేపటి తర్వాత చిరుత తిరిగి వచ్చింది. ఆ కుక్క వద్దకు వచ్చి చూసింది. అది చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత దాన్ని లాక్కెళ్లడానికి ప్రయత్నించింది. కానీ, ఆ కుక్క చెట్టు మొదలుకు కట్టేసి ఉండడంతో అది సాధ్యం కాలేదు. అలా కొద్దిసేపు ఆ చిరుత, కుక్కను లాక్కెళ్లడానికి ప్రయత్నం చేసింది. కొంతసేపటికి తన బలాన్ని మొత్తం ఉపయోగించి గట్టిగా లాగడంతో తాడు తెగిపోయింది. ఆ తర్వాత కుక్కను చిరుత నోట కరుచుకుని ఎత్తుకెళ్లిపోయింది.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో చూసిన తర్వాత ఇంటి యజమానులు షాక్‌కి గురయ్యారు. ఆ కుక్క కట్టేసి ఉండడం వల్ల చనిపోయిందని, లేకపోతే పారిపోయే అవకాశం ఉంటుందని భావించారు. ఇటీవల కాలంలో చిరుతలు దాడి చేస్తున్న ఘటనలు పెరిగిపోయాయని ఆ చుట్టు పక్కల వారు ఆందోళన చెందుతున్నారు.

Diamond Mining: రండి బాబూ రండి.. వజ్రాలు తవ్వి పెట్టండి.. సాయం కోరుతున్న పేద దేశం

Niharika Marriage: ఆకాశ వీధిలో అల్లు ఫ్యామిలీ.. బన్నీ ప్రైవేట్ జెట్ చూశారా?

Niharika Marriage: ఉదయ్ పూర్ కోటలో మహారాణిలా పెళ్లి చేసుకోవడానికి ఎంత ఖర్చవుతుంది?

రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి

మరోవైపు తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక పులి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అయితే ఈ పులి.. ఆసిఫాబాద్ అడవులలో సంచరించేదేనా..? కాదా..? అనే విషయం తేలాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిరుత పులి మృతి చెందింది. గుడిహత్నూర్ మండలం మేకల గండివద్ద జాతీయ రహదారిపై ఆదిలాబాద్ నుండి నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి చిరుతపులి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే వెల్లడిస్తామని అటవీ అధికారులు తెలిపారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా రెండు పులులు ప్రజలను హడలెత్తిస్తున్నాయి.

First published:

Tags: Maharashtra, Viral Videos

ఉత్తమ కథలు