ఆక్టోపస్ బతికి ఉండగానే దాన్ని తినేయాలనుకుంది ఓ యువతి.. దానివల్ల బోలెడు కామెంట్లు వస్తాయని ఆశపడింది. వీడియో లైవ్ పెట్టి మరీ కెమెరా ముందుకు వచ్చి ఆక్టోపస్‌ను తినేందుకు నోరు తెరిచింది. కానీ, ఆమెకు ఆ ఆక్టోపస్ చుక్కలు చూపించింది. కర్మ ఫలితం అంటే ఇదే.. అన్నట్లు ఆ యువతి రక్తం కళ్ల జూసింది. వివరాల్లోకెళితే.. చైనాకు చెందిన ఓ యువతి యూట్యూబ్, బ్లాగ్‌లను నడుపుతోంది. అందులో భాగంగా.. లైవ్‌గా ఆక్టోపస్‌ను తినాలని దాన్నిచేతిలో పట్టుకుని నోరు దగ్గర పెట్టుకుంది. దాని కాలును నోటిలో పెట్టుకోగానే ఆక్టోపస్ మిగతా కాళ్లతో ఆమె చెంపను, కంటిని గట్టిగా పట్టుకుంది.
దీంతో ఆ యువతి దాన్ని విడిపించుకోడానికి చాలా కష్టపడింది. నొప్పి భరించలేక ఏడ్చేసింది కూడా. ఎట్టకేలకు కష్టపడి లాగేసినా.. ఆక్టోపస్ మాత్రం నెత్తురు కళ్లజూసింది . దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. హెచ్చులకు పోతే ఇలాగే ఉంటుందని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, VIRAL NEWS, Viral Videos, Youtube