CHINESE WOMAN PINNED DOWN COVID TEST DONE FORCIBLY VIDEO VIRAL PVN
Viral Video : వామ్మో..చైనాలో కరోనా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియాలంటే ఈ వీడియో చూస్తే చాలు
చైనాలో బలవంతంగా కరోనా పరీక్షలు
Forcible Covid Tests In China : చైనాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. నాలుగో వేవ్ వస్తుందేమోనని ఆ దేశ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే కరోనా కంటే అధికారుల కఠిన ఆంక్షలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Forcible Covid Tests In China : చైనాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. నాలుగో వేవ్ వస్తుందేమోనని ఆ దేశ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే కరోనా కంటే అధికారుల కఠిన ఆంక్షలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ లాక్ డౌన్ లు విధిస్తున్నారు అధికారులు. ఒక రిపోర్ట్ ప్రకారం చైనాలోని 26 నగరాలకు చెందిన దాదాపు 21 కోట్ల మంది సంపూర్ణ లేదా పాక్షిక లాక్ డౌన్ లో ఉన్నారు. మరో విషయం ఏమిటంటే,చైనా మొత్తం జీడీపీలో 22 శాతాన్ని ఈ 26 నగరాలు అందిస్తున్నాయి. కరోనా పాజిటివ్ వచ్చిన వందలాది మందికి ఇంట్లో క్వారంటైన్ అమలు చేస్తున్నారు. నెగెటివ్ వచ్చిన వాళ్లను ఏకంగా వందల కిలోమీటర్ల దూరం తరలిస్తున్నారు. షాంఘై తదితర ప్రాంతాల్లో కరోనా లక్షణాలు లేకున్న్పటికీ ఐసోలేషన్ లోకి పంపిస్తున్నారు.
మరోవైపు, చైనాలో బలవంతంగా కరోనా పరీక్షలు చేయడం కలకలం రేపుతోంది. బలవంతపు కరోనా పరీక్షలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా కోవిడ్ టెస్టింగ్ సెంట్ వద్ద ఓ మహిళకు బలవంగా కరోనా పరీక్ష చేస్తున్న వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో..ఓ మహిళ కోవిడ్ టెస్ట్ చేయించుకునేందుకు ఇష్టంగా లేకున్నా ఉన్నప్పటికీ.ఆమె బలంవంతంగా నేలపై పడ్డుకోబెట్టి ఆమె రెండు చేతులు పట్టుకొని ఆమెను ఎటూ కదలనివవ్వకుండా ఓ మనిషి ఆమెపై కూర్చొని ఆమె నోరుని బలంవంగా తెరిచి ఉండగా,కోవిడ్ సూట్ లో ఉన్న ఓ హెల్త్ కేర్ వర్కర్ ఆమెకి బలవంతంగా కరోనా టెస్ట్ నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. చైనాలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా విషాదకరమైనది, ఖచ్చితంగా భరించలేనిది అని మరికొందరు నెటిజన్లు ఈ వీడియో చూసి కామెంట్స్ చేస్తున్నారు . అయితే ఈ వీడియో ఏ ప్రాంతంలోనిది అన్నది మాత్రం ఇంకా ధ్రువీకరణ కాలేదు. మొదట ఈ వీడియోలను వీబో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత అన్ని సోషల్ మీడియాల్లోకి వెళ్లిపోయింది. అయితే షాంఘైలో ఇలా బలవంతంగా కోవిడ్ పరీక్షలు చేస్తున్నారన్నట్లు సమాచారం. ఇక, తప్పనిసరి కోవిడ్ పరీక్షల కోసం గత నెలలో చైనీస్ హెల్త్‌కేర్ వర్కర్లు ఒక వృద్ధుడి ఇంటికి బలవంతంగా ప్రవేశించడాన్ని చూపిస్తూ మరికొందరు నెటిజన్లు ఇలాంటి మరిన్ని వీడియోలను పోస్ట్ చేశారు.
మరోవైపు,ముందుజాగ్రత్త చర్యగా చైనా రాజధాని బీజింగ్ లో కూడా 40కి పైగా సబ్వే స్టేషన్లు, 158 బస్సు మార్గాలను మూసివేశారు అధికారులు. 16 బీజింగ్ జిల్లాల్లో పన్నెండు జిల్లాలు ఈ వారం మూడు రౌండ్ల పరీక్షలలో రెండవదాన్ని నిర్వహిస్తున్నాయి, గత వారం మూడు మాస్ స్క్రీనింగ్‌లు జరిగాయి.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.