Viral Video: పెళ్లి చేసుకుని ఫస్ట్ కిస్ ఇచ్చే టైమ్‌లో... మాజీ లవర్ రచ్చ రచ్చ..

ఈ తతంగం మొత్తం కొద్దిసేపు చూసిన భార్య, వెంటనే అక్కడి నుంచి విసుగుచెంది వెళ్లిపోయింది. భర్త కూడా ఆమె వెంట పరుగులు పెడుతూ వెళ్లిపోయాడు.

news18-telugu
Updated: April 10, 2019, 11:59 AM IST
Viral Video: పెళ్లి చేసుకుని ఫస్ట్ కిస్ ఇచ్చే టైమ్‌లో... మాజీ లవర్ రచ్చ రచ్చ..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 10, 2019, 11:59 AM IST
మనం చాలా సినిమాల్లో చూసి ఉంటాం. లవర్స్ బ్రేకప్ అయిపోవడం. ఎవరి జీవితాలను వారు గడపాలనుకోవడం, ఈ క్రమంలో ఎవరో ఒకరు పెళ్లి చేసుకోవాలని ఫిక్సవడం.. ఆ టైమ్‌లో సడన్‌గా పాత లవర్ వచ్చి ‘నా తప్పు తెలుసుకున్నాను. మనం పెళ్లి చేసుకుందాం’ లాంటి సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టడం సహజం. అయితే, కొన్ని కొన్ని సందర్భాల్లో ‘భర్త రెండో పెళ్లి చేసుకుంటుండగా, పెళ్లి పందిట్లో మొదటి భార్య హల్ చల్’ అని టీవీల్లో వార్తలు కూడా చూసి ఉంటాం. ఇది కూడా అలాంటిదే. అయితే, ఇది చైనాలో జరిగింది. ఓ పెళ్లి వేడుక కళకళలాడుతోంది. చర్చిలో వారి పెళ్లయింది. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం.. పెళ్లయిన తర్వాత భార్యను ముద్దుపెట్టుకోవడం సహజం. అలాగే, తన భార్యకు ముద్దుపెడుతున్న సమయంలో ఆ పెళ్లికొడుక్కి పెద్ద షాక్ తగిలింది.

తన మాజీ లవర్ పెళ్లి గౌన్ వేసుకుని తన పెళ్లి వేడుకకు వచ్చింది. అంతే కాదు. అందరూ చూస్తుండగా అతడిని పట్టుకుని కాళ్లావేళ్లా బతిమిలాడుతోంది. తనదే తప్పు అని తనను పెళ్లి చేసుకోవాలని వేడుకుంటోంది. ఓ వైపు అప్పుడే తన జీవితంలోకి వచ్చిన భార్య చేయి పట్టుకుని ఉంది, మరోవైపు తన మాజీ లవర్ చేయి పట్టుకుని లాగుతోంది. ఏం చేయాలో పాలుపోక అతడు మాజీ లవర్‌ను విదిలించేశాడు.



ఈ తతంగం మొత్తం కొద్దిసేపు చూసిన భార్య, వెంటనే అక్కడి నుంచి విసుగుచెంది వెళ్లిపోయింది. భర్త కూడా ఆమె వెంట పరుగులు పెడుతూ వెళ్లిపోయాడు. ఆ మాజీ లవర్ మాత్రం అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉండపోయింది. ఈ అద్భుత సన్నివేశాన్ని ఆ పెళ్లికి వచ్చిన అతిథి వీడియో తీసి.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.

First published: April 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...