Home /News /trending /

CHINESE TIKTOK STAR XIAO QIUMEI FALLS FROM 160 FETES HEIGHT CRANE WHILE RECORDING VIDEO NGS

live accident: యువ టిక్ టాక్ స్టార్ దుర్మరణం.. వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా ఊహించని ఘటన

చైనా టిక్ స్టార్ దుర్మరణం

చైనా టిక్ స్టార్ దుర్మరణం

సాహసాలతో సెలబ్రిటీలు అవుతున్నారు.. కానీ ఆ సాహసాలే ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా చైనాలో యువ టిక్ టాక్ స్టార్ 160 అడుగుల ఎత్తులో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి దుర్మరణం పాలైంది..

    ఫేమస్ కావాలనో.. అద్భుతాలు చేయాలనో.. కొందరు చేసే సాహసాలు ప్రాణాలపైకి తెస్తూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. వీక్షకులకు వినోదం పంచాలనో.. లేక తమ పాపులార్టీ పెంచుకోవాలనో కారణం ఏదైనా కొందరు సాహసోపేతమైన వీడియోలు చేస్తూంటారు.. అందులో ప్రమాదం పొంచి ఉందనే వాస్తవాన్ని గుర్తించలేకపోతున్నారు. తాజాగా 23ఏళ్ల ఓ టిక్ టాక్ స్టార్ పాపం లైవ్ స్ట్రీమింగ్ చేస్తూనే కిందకు పడిపోయింది. అయితే ఆమె లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నది 160 అడుగుల ఎత్తుపై. అయితే అంత ఎత్తుపై నుంచి వీడియోలు చేయడం ఆమెకు కొత్త ఏమీ కాదు. అలాంటి వీడియోలతోనే ఆమె చాలా పాపులర్ అయ్యింది. అమె తన ఉద్యోగం ముగిసిన తరువాత టిక్ టాక్ లో వీడియో పెట్టాలని లైవ్ స్ట్రీమింగ్ కు వెళ్లింది.. కానీ ఊహించని ప్రమాదం ఆమెను బలి తీసుకుంది. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. ఆ ప్రమాద ఘటనను లైవ్ లో చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం చేయాలో తెలియక కన్నీరు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త తెలిసి ఆమె టిక్ టాక్ ఫాలోవర్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

    చైనీస్ టిక్ టాక్ స్టార్ 23 ఏళ్ల జియావో క్యుమీ వీడియో షూట్ చేస్తూ దుర్మరణం పాలైన ఘటన షాక్‌కు గురిచేసింది. టిక్‌టాక్‌ వీడియో రికార్డ్ చేస్తూ 160 అడుగుల నుంచి కింద పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రొఫెషనల్ క్రేన్ ఆపరేటర్‌గా పనిచేసే జియావో ఆ క్రేన్ నుండే పలు వీడియోలు తీస్తూ ఉండేది. ఇలా అనేక వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ స్టార్‌గా పాపులర్‌ అయింది. ఈ క్రమంలోనే సహోద్యోగులంతా ఇంటికి వెళ్లి పోయిన తరువాత క్రేన్ క్యాబిన్లో కూర్చుని వీడియో తీసుకోవడానికి ప్రయత్నించింది జియావో. కానీ ఇంతలోనే అదుపు తప్పి కింద పడిపోయింది.

    ఫోన్‌ చేతిలో పట్టుకుని కింద పడిపోతున్న దృశ్యాలు వీడియోలో అస్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో ఈ వీడియో వైరల్‌ అయింది. టిక్‌టాక్ చైనీస్ వెర్షన్‌ డౌయిన్ ప్లాట్‌ఫాంలో లక్షమంది మందికి పైగా ఫాలోవర్లో జియావో క్యుమీ చైనాలో అత్యంత ప్రజాదరణ పొందారు. ఇద్దరు బిడ్డల తల్లి అయిన ఈమె డ్యాన్స్ వీడియోలు కూడా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాయి. దీంతో జియావో ఆకస్మిక మరణం అభిమానులను తీవ్ర విషాదంలోకి ముంచింది. కాగా ఇటీవల హాంగ్‌కాంగ్‌కు చెందిన డేర్‌డెవిల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ సోఫియా చుంగ్‌ జలపాతం సమీపంలో ఇన్‌స్టాగ్రామ్ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Accident, China, Tiktok

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు