హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

TikTok Stunts: టిక్ టాక్ వీడియో కోసం క్రేన్‌పై స్టంట్.. కాసేపటికే శవంగా మారిన యువతి

TikTok Stunts: టిక్ టాక్ వీడియో కోసం క్రేన్‌పై స్టంట్.. కాసేపటికే శవంగా మారిన యువతి

క్రేన్‌పై నుంచి పడి టిక్ టాకర్ మృతి

క్రేన్‌పై నుంచి పడి టిక్ టాకర్ మృతి

టిక్​టాక్‌లో క్యుమీ పాపులర్​ సెలబ్రెటీ. వైవిధ్యమైన టిక్​టాక్​ వీడియోలు చేస్తూ ఎంతో మంది ఫాలోవర్స్​ను సంపాదించుకుంది. క్యుమీ క్రేన్​ ఆపరేటర్​గా పనిచేస్తూనే తన ఫాలోవర్స్​ కోసం టిక్​టాక్​ వీడియోలు పోస్ట్​ చేస్తుండేది.

మన దేశంలో ఇప్పుడైతే టిక్ టాక్ లేదు. కానీ రెండేళ్ల క్రితం ఒక ఊపు ఊపేసింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా అందరూ టిక్ టాక్ వీడియోల్లో బిజీగా ఉండేవారు. వీడియోలు చేయడం అప్‌లోడ్ చేయడం.. చాలా మంది ఇదే ఒకపనిగా పెట్టుకునేవారు. ప్రస్తుతం టిక్ టాక్ లేకున్నా.. యూబ్యూట్ షార్ట్స్, ఇన్‌స్టగ్రామ్ రీల్స్, మోజ్, జోష్, టాకాటక్ వంటి షార్ట్ వీడియో అప్లికేషన్‌ల వినియోగం పెరిగింది. ఐతే ఈ​ వీడియోల వ్యసనంతో ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా యువత టిక్​టాక్​ మాయలో పడి వారి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఎత్తు నుంచి దూకడం, వాహనాలపై వేగంగా వెళ్లడం, రైళ్లకు అడ్డంగా వెళ్లి నిల్చోవడం వంటి ప్రమాదకరమైన ఫీట్లు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఇటువంటి ఫీట్ ఒకటి చేసి ప్రాణాలు కోల్పోయిందో యువతి. చైనాకు చెందిన 23 ఏళ్ల జియావో క్యుమీ అనే టిక్​టాక్​ సెలబ్రెటీ.. ఒక స్టంట్ చేస్తూ మృతి చెందింది. జూలై 20న 160 అడుగుల క్రేన్​పై నుంచి కింద పడి అక్కడికక్కడే మరణించింది. ఈ విషయాన్ని చైనా మీడియా సంస్థ ది సన్ ధ్రువీకరించింది.

ముందుగా ఆమె క్రేన్​పై నిల్చొని టిక్​టాక్​ వీడియో చేస్తుండగా అకస్మాత్తుగా చేతిలోని స్మార్ట్​ఫోన్​ జారింది. దీంతో దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అలా ఆమె చేతికి స్మార్ట్​ఫోన్​ చిక్కినప్పటికీ, అంత పెద్ద ఎత్తు నుంచి కింద పడటంతో అక్కడికక్కడే మరణించింది. ఈ ప్రమాదకరమైన స్టంట్​కు సంబంధించిన విజువల్స్​​ వీడియోలో రికార్డయ్యాయి. టిక్​టాక్‌లో క్యుమీ పాపులర్​ సెలబ్రెటీ. వైవిధ్యమైన టిక్​టాక్​ వీడియోలు చేస్తూ ఎంతో మంది ఫాలోవర్స్​ను సంపాదించుకుంది. క్యుమీ క్రేన్​ ఆపరేటర్​గా పనిచేస్తూనే తన ఫాలోవర్స్​ కోసం టిక్​టాక్​ వీడియోలు పోస్ట్​ చేస్తుండేది. ఇలా యువతలో ఆమె మంచి క్రేజ్ ఏర్పర్చుకుంది.

భిన్నంగా స్పందించిన కుటుంబ సభ్యులు..

టిక్​టాక్​ వీడియో చేస్తూ క్యుమీ మరణించిందని స్థానిక మీడియా చెబుతుండగా.. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం భిన్నంగా స్పందించారు. టిక్​టాక్​ వీడియో కోసం స్టంట్ చేయడం వల్ల క్యుమీ చనిపోలేదని, పొరపాటున క్రేన్​ నుంచి జారి పడి చనిపోయిందని తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో క్యుమీ టిక్​టాక్​ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను వారు ఖండించారు. క్యుమీ క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తుందని, ఆమె ప్రొఫెషనల్ క్రేన్​ ఆపరేటర్​ అని గుర్తు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆమె ఫోన్​ బ్యాగ్​ లోపలే ఉందని పేర్కొన్నారు. అయితే, ఈ సంఘటన జరిగినప్పుడు క్యుమీ చేతిలో ఫోన్ ఉందని ప్రత్యక్ష సాక్షులు చెప్పుకొచ్చారు.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: China, Tik tok, Tiktok, Viral Video

ఉత్తమ కథలు