Video: ఇళ్లకు తాళం వేసి.. బయటకు రాకుండా తలుపులకు మేకులు.. చైనాలో మళ్లీ కఠిన క్వారంటైన్

ఇళ్ల తలుపులకు మేకులు కొడుతున్న వైద్య సిబ్బంది

China delta Variant cases: చైనాలో డెల్టా వేరియెంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి, మార్చిలో వుహాన్‌ నగరంలో ఎలాంటి కఠినమైన నిబంధనలను అమలు చేశారో.. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో అవే రకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

  • Share this:
    కరోనా వైరస్ ఇంకా ఈ ప్రపంచాన్ని వదల్లేదు. మన దేశంలో సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినప్పటికీ.. మళ్లీ కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి. డెల్టా వేరియెంట్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ వేరియెంట్‌తో అమెరికాలో రోజువారీ కేసుల సంఖ్య లక్షకు పైగానే నమోదవుతున్నాయి. చైనాలోనూ డెల్టా కేసు సంఖ్య భారీగా పెరుగుతోంది. కొత్త కేసులు మళ్లీ పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమయింది. డెల్టా వేరియెంట్ విజృంభించకుండా కొన్ని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. ఎంతలా అంటే.. క్వారంటైన్‌లో ఉన్న వారి ఇళ్లకు తాళం వేసి.. బయటకు రాకుండా మేకులు కొడుతున్నారు. ఇంటి లోపలే వారిని బంధిస్తున్నారు. కోవిడ్ అనుమానితులను ఇంట్లో వేసి తాళం వేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్‌గా మారాయి.

    ఓ వ్యక్తి క్వారంటైన్‌లో ఉంటున్నాడు. రోజంతా ఇంట్లో ఉండి బోర్‌గా ఫీలయ్యాడు. ఓ రోజు సాయంత్రం పూట చల్ల గాలి పీల్చుకుందామని సరదాగా అలా బయటకు వచ్చాడు. అంతే సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది నేరుగా అక్కడికి చేరుకున్నారు. అతడిని మందిలించి ఇంట్లోకి వెళ్లమని చెప్పారు. బయటి నుంచి తాళం వేసి.. ఐరన్ బార్స్‌ను తలుపులకు కొట్టి.. ఇంకోసారి బయటకు రాకుండా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



    మరో వీడియోలో ఓ చిన్నారి పీపీఈ కిట్లు ధరించిన వైద్య సిబ్బంది ముందు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆమె క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఫిర్యాదులు రావడంతో సిబ్బంది అక్కడికి వెళ్లి.. ఆ ఇంటిని లాక్ చేశారు. ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకుండా తలుపులకు ఐరన్ బార్స్‌ను X ఆకారంలో ఉంచి మేకులు కొట్టారు.



    ఎవరైనా రోజుకు మూడు కంటే ఎక్కువ సార్లు ఇంటి తలుపును తెరిస్తే వారికి మూడినట్లే. నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వైద్య సిబ్బంది వెంటనే వాలిపోతున్నారు. పీపీఈ కిట్లు ధరించి నిర్ధాక్షిణ్యంగా ఆ ఇంటికి తాళాలు వేస్తున్నారు.


    చైనాలో డెల్టా వేరియెంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి, మార్చిలో వుహాన్‌ నగరంలో ఎలాంటి కఠినమైన నిబంధనలను అమలు చేశారో.. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో అవే రకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏకంగా ఇళ్లకు తాళం వేసి.. ఐరన్ బార్స్‌తో బ్లాక్ చేస్తున్నారంటేనే.. అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

    ఇవి కూడా చదవండి:

    242 మంది పిల్లలకు కరోనా.. థర్డ్ వేవ్ మొదలైందా ? అసలేం జరుగుతోంది ?

    Covaxin-Covishied: కొవాగ్జిన్, కోవిషీల్డ్ డోసుల మిక్సింగ్‌పై డీసీజీఐ కీలక నిర్ణయం..
    Published by:Shiva Kumar Addula
    First published: