Man Living In Cave For 14 Years Over Rs 1859 Theft: చైనాలో ఓ దొంగ చేసిన పని అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాకుండా అతని కథ విని అయ్యయ్యో అంటూ సోషల్ మీడియా వేదికగా అతడి మీద జాలి కూడా చూపిస్తున్నారు నెటిజన్లు. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవడం అంటే ఇదేనేమో అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇంతకీ ఆ దొంగపై నెటిజన్లు జాలి చూపించడానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
చైనాలోని(China) హుబీ ప్రావిన్స్‌లోని ఒక గ్రామానికి చెందిన లియు మౌఫు(Liu Moufu)అనే వ్యక్తి 2009లో తన బావ మరియు మరొక సహచరుడితో కలిసి ఎన్‌షి సిటీలోని ఓ గ్యాస్ స్టేషన్ లో దొంగతనానికి(Robbery) వెళ్లారు. అక్కడ వారికి 156 యువాన్(చైనా కరెన్సీ)మాత్రమే దొరికాయి. అంటే భారతీయ కరెన్సీలో రూ.రూ. 1,859 దొంగలించారు. ఆహారం మరియు బాణసంచా కోసం 60 యువాన్లు (రూ. 715) ఖర్చు చేసి, మిగిలిన మొత్తాన్ని ముగ్గురు పంచుకున్నారు. ఒక్కొక్కరి వద్ద 32 యువాన్లు (రూ. 381) పంచుకొన్నాక ఎవరిదారిన వారు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే దొంగతనం గురించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి లియు మౌఫు బావ,ఫ్రెండ్ ని పట్టుకున్నారు. అయితే అరెస్టు కాకుండా తప్పించుకోవాలని లియు నిర్ణయించుకున్నాడు. వెంటనే దగ్గర్లోని జనావాసానికి 10 కీలోమీటర్ల దూరంలోని అడవిలోని ఒక చిన్న గుహలోకి వెళ్లిపోయాడు. 14ఏళ్లుగా అక్కడే తలదాచుకుంటున్నాడు. అడవిలొ జంతువులను వేటాడి ఆహారంగా తీసుకునేవాడు. తనకు క్రూరమృగాల నుంచి రక్షణగా రెండు కుక్కలను కూడా లియు పెంచుతున్నాడు.
Bhutan : భారతీయ పర్యాటకులకు భూటాన్ గుడ్ న్యూస్..తక్కువ ధరకే బంగారం
అయితే ఒక్కోసారి ఆహారం దొరకనప్పుడు కూరగాయలు మరియు మాంసాన్ని దొంగిలించడానికి తన స్వగ్రామానికి వెళ్లి కొన్ని నిమిషాలు తన కుటుంబాన్ని కూడా సందర్శించేవాడు. పండుగల సమయంలో కుటుంబాన్ని సందర్శించేటప్పుడు జాగ్రత్తగా ఉండేవాడు. కానీ ప్రజలు అతనిని గుర్తించేవారు,పోలీసులు అతనిని వెంబడించారు. లియూ కుటుంబ సభ్యులకు కూడా అతడు ఎక్కడ ఉంటున్నాడనేది తెలియదు. తమను కలవడానికి వచ్చినప్పుడల్లా అతని కుటుంబం అతన్ని లొంగిపోయేలా చేయడానికి ప్రయత్నించింది, కానీ లియూ అందుకు నిరాకరించాడు. అయితే చాలా కాలంగా తాను కుటుంబం నుండి తనను తాను దూరంగా ఉంచుతున్నానని గ్రహించిన లియూ తాజాగా పోలీసుల దగ్గరకు వెళ్లి స్వయంగా సరెండర్ అయ్యాడు. తన తండ్రి అంత్యక్రియలు, అతని కొడుకు పెళ్లి, అతని మనవడిని చూడలేకపోయాను అని తనలో తానే బాధపడిన లియూ గత నెలలో పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులను తాను నివసించిన గుహ దగ్గరకు తీసుకెళ్లాడు.
స్థానిక మీడియాతో లియూ మాట్లాడుతూ తన వయసు 50 ఏళ్లు పైబడిందని, తన భార్య అనారోగ్యంతో ఉందని, ఓ మనవడు కూడా ఉన్నాడని చెప్పాడు. తాను సాధారణ జీవితాన్ని గడపాలనుకుంటున్నాను అని తెలిపారు. ఇన్నేళ్లు తాను గుహలో దాక్కున్నందుకు చింతస్తున్నానను నా కుటుంబానికి దూరంగా బతకాల్సి వచ్చింది అని తెలిపారు. చైనాలో దోపిడీని తీవ్రమైన క్రిమినల్ నేరంగా పరిగణిస్తున్నందున లియు ఇంకా జైలులో శిక్షను అనుభవించవలసి ఉంది. అతను 3 లేదా 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుందని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Thief Arrested