• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • CHINESE MAN BUILDS AN ENTIRE ISLAND FOR EX GIRLFRIEND SU GH

మాజీ ప్రియురాలి ప్రేమ కోసం అతడు ఓ ఐలాండ్‌నే నిర్మించాడు.. ఇంతకు ఆమె ఒప్పుకుందా?

మాజీ ప్రియురాలి ప్రేమ కోసం అతడు ఓ ఐలాండ్‌నే నిర్మించాడు.. ఇంతకు ఆమె ఒప్పుకుందా?

ప్రతీకాత్మక చిత్రం

ఈ రోజుల్లోనూ ప్రేమ కోసం ఏమైనా చేసే వారున్నారు. ఓ వ్యక్తి తన మాజీ ప్రియురాలి ప్రేమ కోసం ఓ ద్వీపాన్నే నిర్మించాడు.

  • Share this:
చరిత్రలో ప్రేమకు సంబంధించి ఎన్నో ఆనవాళ్లు, మరెన్నో జ్ఞాపకాలు స్మరణకు వస్తాయి. ఒక్కసారి చరిత్ర పుటలను తిరిగేస్తే మనకు రోమియో-జూలియట్, సలీం-అనార్కలీ లాంటి ఎంతో మంది త్యాగం కనిపిస్తుంది, ప్రేమికుల చిహ్నంగా తాజ్ మహల్ వంటి కట్టడాలు కూడా దర్శనమిస్తాయి. అయితే ఇవన్నీ గతంలో జరిగినవి కదా.. ఇప్పుడు అలాంటివారు ఎవరున్నారు అనుకుంటే పొరపాటే.. ఈ రోజుల్లోనూ ప్రేమ కోసం ఏమైనా చేసే వారున్నారు. తాజాగా చైనాకు చెందిన ఓ వ్యక్తి తన మాజీ ప్రియురాలి ప్రేమ కోసం ఓ ద్వీపాన్నే నిర్మించాడు. దురదృష్టవశాత్తు ఈ ప్రయత్నం విఫలమైనప్పటికీ ప్రస్తుతం ఇది ప్రేమికులకు హాట్ స్పాట్ గా మారింది.  చైనాలోని యాంగ్డె నగరానికి సమీపంలో ఉన్న హోటేయూ గ్రామంలో ఈ ద్వీపం ఉంది.  వివరాల్లోకి వెళ్తే చైనాకు చెందిన 30 ఏళ్ల షూ 2020లో తన ప్రియురాలితో విడిపోయాడు. అనంతరం షూ తన తల్లిదండ్రులను చూసుకునేందుకు తన స్వగ్రామానికి వచ్చాడు. అయితే రిలేషన్ షిప్ కు బ్రేకప్ చెప్పడం అతడికి అస్సలు ఇష్టం లేదు.

అందుకే తన ప్రియురాలి ప్రేమను ఎలాగైనా తిరిగి పొందేందుకు ఓ ఐలాండ్ రూపకల్పన చేయాలని సంకల్పించాడు. ఇందుకోసం లక్ష యువాన్లు ఖర్చు చేశాడు. తన దాచుకున్న మొత్తాన్ని ఇందుకోసం వెచ్చించాడు.ఐలాండ్ నిర్మాణానికి బిల్డర్లు, ఆర్కిటెక్టులను నియమించుకున్నాడు. ఆర్క్ బ్రిడ్జితో పాటు ఆకర్షణీయమైన రంగురంగుల పూలు ద్వీపమంతా ఉండేలా ప్లాన్ చేసి సఫలీకృతుడయ్యాడు. ఈ ద్వీపం 20 నుంచి 30 చదరపు మీటర్లే ఉన్నప్పటికీ గులాబీ రంగు గడ్డి, చెర్రీ చెట్లుతో పాటు ప్రేమకు సంకేతమైన ఇతర చిహ్నాలు కూడా పొందుపరిచారు. ఈ జనవరితో ఈ ద్వీపం నిర్మాణం పూర్తయింది.

షూ.. ప్రియురాలు ఈ ఐలాండ్ కు వచ్చి తన ప్రేమను అంగీకరించడమే తరువాయి అనుకున్నాడు. పాపం షూ కల మాత్రం నిజం కాలేదు. ఆమె ఈ ఐలాండ్ కు రావాడానికి నిరాకరించింది.షూ.. ప్రియురాలు ప్రేమను నిరాకరించినప్పటికీ అతడు నిర్మించిన ఈ ఐలాండ్ ప్రస్తుతం ప్రజల ఆదారణ చూరగొంటుంది. ప్రేమ జంటలకు కేరాఫ్ అడ్రెస్ గా మారి లవర్స్ ఐలాండ్ గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికే చాలా మంది ఇక్కడ తమకిష్టమైన వారికి ప్రేమ ప్రతిపాదనలు చేస్తున్నారు. అంతేకాకుండా వివాహానికి ముందు, వివాహానంతర ఫొటోషూట్లను నిర్వహించుకుంటున్నారు.
Published by:Sumanth Kanukula
First published:

అగ్ర కథనాలు