హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Scorpion Farming: ఇంటి పైకప్పుపై తేళ్ల సాగు.. ఏందక్కా ఇది..? ఇంకో కొత్త వ్యాధిని తెస్తారా?

Scorpion Farming: ఇంటి పైకప్పుపై తేళ్ల సాగు.. ఏందక్కా ఇది..? ఇంకో కొత్త వ్యాధిని తెస్తారా?

ఇంటి పైకప్పుపై తేళ్ల సాగు

ఇంటి పైకప్పుపై తేళ్ల సాగు

Scorpion Farming: ఇంట్లో కోళ్లను పెంచుకున్నట్లుగా ఆ యువతి తన ఇంటిపై ఎర్ర తేళ్లను పెంచుతోంది. ఏదో సరదా కోసం అయితే ఒకటి రెండు ఉంటాయి. కానీ ఆ ఇంటి డాబాపై వేల సంఖ్యలో తేళ్లు సాగవుతున్నాయి

  కరోనావైరస్ (Coronavirus) నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. భారత్‌ సహా చాలా దేశాల్లో కరోనా నియంత్రణలోనే ఉంది. రెండళ్లుగా యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారికి చైనా (China)లోనే మూలాలున్నాయి. చైనా ప్రజల అడ్డమైన ఆహారపు అలవాట్లే ఈ కరోనా వ్యాధికి కారణమని ఇప్పటికే ఎన్నో విమర్శలు ఉన్నాయి. పాములు, తేళ్లు, కుక్కలు.. ఒక్కటా రెండా ఈ భూమిపై ఉండే ప్రతి జీవినీ చైనీయులు లాగించేస్తారు. కరకరమని నమిలేస్తారు. అందుకే కరోనా లాంటి కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. ఐతే తాజాగా ఓ యువతి వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారింది. ఇంటి టెర్రస్‌పై తేళ్ల (Scorpions)ను సాగు చేస్తున్న వీడియో ఒకటి ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఇంట్లో కోళ్లను పెంచుకున్నట్లుగా ఆ యువతి తన ఇంటిపై ఎర్ర తేళ్లను పెంచుతోంది. ఏదో సరదా కోసం అయితే ఒకటి రెండు ఉంటాయి. కానీ ఆ ఇంటి డాబాపై వేల సంఖ్యలో తేళ్లు సాగవుతున్నాయి. మన రైతులు కల్లాల్లో ధాన్యం రాశులు పోసినట్లుగా..ఈ యువతి తన ఇంటిపై తేళ్లను సాగు చేస్తోంది.

  Viral: భలే కూతురు.. ‘మమ్మీ.. నువ్వొస్తేనే నిద్రపోతా’.. న్యూజిలాండ్ ప్రధాని ఎఫ్‌బీ లైవ్‌‌లో ఉండగా..


  ఈ వీడియోను చూసిన నెటిజెన్లు వామ్మో.. అంటూ నోరెళ్లబెట్టుతున్నారు. ఆమె ఖచ్చితంగా వాటిని ఫ్రై చేసుకొని తింటుంది? మిగిలిన తేళ్లను లోకల్ ఫుడ్ రెస్టారెంట్లకు అమ్ముకుంటుంది? అని కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఇలా చేయబట్టే కరోనా వచ్చింది? ఐనా మారరా? అంటూ మండిపడుతున్నారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుంటే మరో కొత్త వ్యాధి తప్పదని అభిప్రాయపడుతున్నారు. కరోనా మళ్లీ విరుచుకుపడే అవకాశముందని వాపోతున్నారు.

  Skirts: స్కూల్లో అబ్బాయిలు కూడా స్కర్ట్ వేసుకోవాల్సిందే.. ఎక్కడ..? ఎందుకో తెలుసా?

  నేచర్ లవర్స్ ఓకే (Naturelovers_ok) అనే యూజర్.. యువతి తేళ్ల పెంపకం వీడియోను ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది వీక్షించారు. ఐతే అందులో కనిపిస్తున్న యువతిని చైనా అని ఇంకా ధృవీకరణ కాలేదు. ఆమె చైనీస్ అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ చాలా మంది మాత్రం ఆమెది ఖచ్చితంగా చైనానే అని అంటున్నారు. అలా తేళ్లను పెంచేది? వాటిని వండుకొని తినేది? చైనాలో కాకుంటే ఇంకెక్కడ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చైనా వారి వల్ల ఈ ప్రపంచం ఇంకా ఎన్ని కొత్త కొత్త వ్యాధులతో చూడాల్సి వస్తుందోనని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: China, Trending, Trending videos, Viral Video

  ఉత్తమ కథలు