Father punishes son : తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల సంక్షేమం గురించే ఆలోచిస్తారు. పిల్లలు తప్పుదారిలో పయనిస్తుంటే తల్లిదండ్రులు తెలివిగా వారికి సరైన దారి చూపుతారు. అయితే కొందరు తల్లిదండ్రులు ఓవర్ స్ట్రిక్ట్ గా(Parents overstrict) ఉంటారు. ఇది పిల్లల ఎదుగుదలకు ఏమాత్రం సరికాదు. ఇది పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అలాంటి చైనా తండ్రి వార్త సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. అయితే ఈ వార్త చదివిన తర్వాత ఈ తండ్రి ఇంత క్రూరమైన చర్య ఎందుకు చేశాడో మీరు ఆలోచించవలసి వస్తుంది?
చైనాలోని(China) గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని షెన్‌జెన్ నగరంలో నివాసముంటున్న ఓ వ్యక్తి ..11ఏళ్ల తన కొడుకు అర్థరాత్రి మొబైల్‌లో గేమ్ ఆడుతుండగా పట్టుకున్నాడు. అర్థరాత్రి వరకు ఫోన్ లో గేమ్స్ ఆడవద్దు అని గతంలో అనేకసార్లు కొడుకుకి ెప్పాడు తండ్రి. అయినా తండ్రి మాట వినని చిన్నారి అర్థరాత్రి 1 గంట వరకు ఫోన్ లో గేమ్స్ ఆడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు అర్థరాత్రి 1 గంట సమయంలో తన కొడుకు మొబైల్‌లో గేమ్ ఆడుతుండగా తండ్రి పట్టుకున్నాడు. దీని తర్వాత తండ్రి కొడుకుకు గుణపాఠం చెప్పేందుకు శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. అయితే కొట్టడం,తిట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని,పైగా తనపై తన కొడుకు ద్వేషభావం పెంచుకుంటాడని అనుకొని తన కొడుకుకి విచిత్రమైన శిక్ష విధించాలని నిర్ణయించుకున్నాడు. తన కొడుకుని అతడు ఆడుతున్న గేమ్ లో పాస్ అయ్యేవరకు ఆడుతూనే ఉండాలని శిక్ష విధించాడు. దీంతో వరుసగా 17గంటలు ఆ చిన్నారి నిరంతరంగా ఫోన్ లో గేమ్ ఆడవలసి వచ్చింది. ఈ క్రమంలో స్పృహతప్పి కింద చిన్నారి పడిపోయాడు. కానీ అతని తండ్రి కరుణించలేదు. ఈ బాధాకరమైన శిక్షకు సంబంధించిన వీడియో కూడా చైనా మీడియాలో ప్రత్యక్షమైంది.
Heartbreak Insurance : లవ్ బ్రేకప్ కి ఇన్స్యూరెన్స్ ..నెలకు ఎంత కట్టాలో తెలుసా?
తండ్రి తనను తాను సమర్థించుకున్నాడు
ఈ సంఘటన గురించి పిల్లవాడు తన నోట్‌బుక్‌లో రాశాడు. తనకు ఫోన్ పై విరక్తి వచ్చేంత వరకు తన తండ్రి వీడియో గేమ్‌లు ఆడేలా చేశాడని చెప్పాడు. అయితే కొడుకుకి విధించిన శిక్షపై చిన్నారి తండ్రి కూడా సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చాడు. తన కొడుకు నుంచి మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడేందుకు ఈ శిక్ష విధించాల్సి వచ్చిందన్నారు. పిల్లల మంచి కోసం తల్లిదండ్రులు చెడుగా మారవలసి వస్తే అందులో తప్పు లేదని ఆయన అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Father, VIRAL NEWS