• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • CHINA WAMAN BEATS HER BOSS WITH A MOP FOR SEXUAL HARASSMENT VIDEO GOES VIRAL SRD

Viral Video : బాస్ ని చీపురు తిరగేసి చితకబాదిన మహిళా ఉద్యోగి..ఎందుకో తెలుసా..?

Viral Video : బాస్ ని చీపురు తిరగేసి చితకబాదిన మహిళా ఉద్యోగి..ఎందుకో తెలుసా..?

Photo Credit : You Tube

Viral Video : ఉద్యోగాలకు వెళ్ళే మహిళలకు నిత్యం ఆకతాయిల వేధింపులు జరుగుతున్నా.. పరువు పోతుందనే భయంతో.. లేదా ఎదురు తిరిగితే తమనేమైన చేస్తారనే భయంతో చాలా మంది అమ్మాయిలు భయపడిపోతూ.. సైలెంట్ గా ఉంటున్నారు. అయితే ఓ యువతి మాత్రం అలా నిశబ్బంగా ఊరుకోలేదు.

  • Share this:
    ఎక్కడ చూసిన అమ్మాయిలపై ఆకతాయిల వేధింపులు మరింత పెరుగుతున్నాయి. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ కూడా ఇంతే. స్కూల్స్, కాలేజీలు, ఉద్యోగాలకు వెళ్ళే మహిళలకు నిత్యం ఆకతాయిల వేధింపులు జరుగుతున్నా.. పరువు పోతుందనే భయంతో.. లేదా ఎదురు తిరిగితే తమనేమైన చేస్తారనే భయంతో చాలా మంది అమ్మాయిలు భయపడిపోతూ.. సైలెంట్ గా ఉంటున్నారు. అయితే ఓ యువతి మాత్రం అలా నిశబ్బంగా ఊరుకోలేదు. కార్యాలయంలోని మహిళా ఉద్యోగులకు డర్టీ మెస్సేజ్‌లు పంపే బాస్‌ని ఓ మహిళా ఉద్యోగి చితకబాదింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ మహిళా ఉద్యోగిని అందరూ అభినందిస్తున్నారు. ఈ వీడియోను బాధితురాలు స్వయంగా చిత్రీకరించింది. అందులో ఆమె తన యజమానిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈ వీడియో చైనాకు చెందినదిగా తెలుస్తోంది.ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగి చేసిన ఆరోపణ ప్రకారం.. ఆమె యజమాని ఎప్పుడూ ఆమెను లైంగికంగా వేధించేవాడు. ఎప్పుడూ ఆమెకు అశ్లీల సందేశాలను పంపించేవాడు. దీంతో ఓపిక నశించిన ఆమె బాస్‌కి తగిన గుణపాఠం చెప్పాలనుకుంది. కోపంతో అతడిపై విరుచుకుపడింది.

    ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె కోపంతో బాస్ క్యాబిన్లోకి వెళుతుంది. ఒక కుండ నీళ్ళు తీసుకొని అతడి మొహంపై విసురుతుంది. అనంతరం వెనకున్న చీపురుతో యజమానిని కొట్టడం ప్రారంభిస్తుంది. తరువాత బాస్ ముందు ఉన్న పుస్తకం అతడిపై విసురుతుంది. అనంతరం చీపురుతో ఇష్టారీతిన కొడుతూ తిడుతుంది. అలా చేస్తూనే వీడియోను కూడా రికార్డ్ చేసింది.

    ఆ సమయంలో బాస్‌ మొహం దాచి క్షమాపణలు కోరుతాడు. తాను ఒక జోక్‌గా టెస్ట్ చేశాను అని సమాధానమిస్తాడు. దీనికి ఆ మహిళ మీ క్యారెక్టర్‌ ఎంత వరెస్టో తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా మహిళలను కార్యాలయ ఉద్యోగులుగా గౌరవించారా అని నిలదీస్తుంది. ఈ మొత్తం వీడియో 14 నిమిషాల నిడివి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే వీడియో చూసిన తర్వాత చాలా మంది మహిళను ప్రశంసించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అమ్మాయి ధైర్యానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. అమ్మాయిలు తమను తాము రక్షించుకోవడానికి ధైర్యంగా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు