China Starving People Catch Fish Using Drones: కరోనా మహామ్మారి చైనాను మరోసారి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే అక్కడ ప్రతి రోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక.. షాంఘైలో కేసుల సంఖ్య మరీ దారుణంగా పెరుగుతుంది. ఇప్పటికే కొన్నివారాలుగా అక్కడి ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక ఇళ్లలో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అక్కడ నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా మారింది. ప్రభుత్వం.. కొన్ని చర్యలు తీసుకున్నప్పటికి అవి ఏకోసానా సరిపోవట్లేదు. అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.
ఇక చైనా ప్రభుత్వం , అక్కడి వారిని ఇంట్లో పక్కన పక్కన పడుకొవద్దని, హాగ్ లు, కిస్ లకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక రోబోల సహాయంతో అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇక షాంఘై నగరంలో నిర్మానుష్యంగా మారిపోయింది. చైనాలో కొందరు పెంపుడు జీవులను చంపుతున్నట్లు పలు వార్త కథనాలు బయటకు వస్తున్నాయి. అక్కడి ప్రజలు ప్రధానంగా ఆహారం కోరతతో తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ఈ క్రమంలో చైనా అవస్థను తెలియజేసే మరో వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Grocery shopping in Shanghai, 2022 edition. pic.twitter.com/Azz3f6KKee
— Rodrigo Zeidan (@RodZeidan) April 16, 2022
పూర్తి వివరాలు.. చైనాలోని షాంఘైలో కరోనా మహామ్మారి ఉధృతి వలన లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు.. 25 మిలియన్ల ప్రజలు తమ ఇళ్లకే పరిమిత మయ్యారు. తాజాగా, కొందరు ఆహారం కోసం చేసిన ప్రయత్నం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఒక అపార్ట్ మెంట్ పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంది. అందులో చాలా చేపలు ఉన్నాయి. కానీ అక్కడ లాక్ డౌన్ వలన ప్రజలకు బయటకు వెళ్లడానికి అనుమతి లేదు.
దీంతో అతను ఒక డ్రోన్ ను ఏర్పాటు చేశాడు. ఆ డ్రోన్ కు ఒక తాడును బిగించి, రిమోట్ కంట్రోల్ సహయంతో స్విమ్మింగ్ ఫూల్ లో వేశాడు. అప్పుడు నీళ్లలో ఉన్న చేప గాలానికి పట్టుకొగానే, దానికి తట్టుకుంది. అప్పుడు వెంటనే అతను రిమోట్ సహాయంతో దాన్ని పైకి లాగాడు. ఇది అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న దీన స్థితికి అద్దం పడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Covid -19 pandemic, Fish, Viral Video