Rocket: జాగ్రత్త... ఆ రాకెట్ ఆకాశం నుంచి పడిపోతోంది... ఎక్కడైనా పడొచ్చు

Rocket: జాగ్రత్త... ఆ రాకెట్ ఆకాశం నుంచి పడిపోతోంది... ఎక్కడైనా పడొచ్చు (image credit - twitter)

Rocket: ఒకప్పుడు స్కైలాబ్ అనేది ఆకాశం నుంచి పడుతోందని తెలిసి ప్రజలు చాలా ఆందోళన చెందారు. ఇప్పుడు అలాంటిదే ఓ రాకెట్ ఆకాశం నుంచి పడుతోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • Share this:
    ఏప్రిల్ 29న భూమి నుంచి బయలుదేరి... చైనా స్పేస్ స్టేషన్‌ తియాన్హే (Tianhe)కి చెందిన కోర్ మాడ్యూల్‌ని మోసుకెళ్లిన లాంగ్ మార్చ్ 5B రాకెట్... పేలిపోయింది. అది సరిగా పనిచెయ్యలేదు. దాన్ని శాస్త్రవేత్తలు కంట్రోల్ చెయ్యలేకపోయారు. కానీ అది పేలిపోవడంతో... దాని శకలాలు... ఇప్పుడు భూమివైపు దూసుకొస్తున్నాయి. అయితే... అవి భూమిపై ఎక్కడైనా పడే ప్రమాదం ఉందని అంటున్నారు. అదేమీ చిన్న రాకెట్ కాదు. 22.5 మెట్రిక్ టన్నులు ఉంది. దీనిలో ఉన్న కోర్ మాడ్యూల్... రాకెట్ నుంచి బయటకు వచ్చి... కక్ష్యా మార్గంలోకి వెళ్లింది. అది వారంలో పని ప్రారంభిస్తుంది. ఐతే... అది బయటకు వచ్చాక... రాకెట్‌ను సురక్షితంగా సముద్రంలో కూల్చేయాల్సి ఉంది. కానీ... చైనా స్పేస్ శాస్త్రవేత్తలు దాన్ని కంట్రోల్ చెయ్యలేకపోయారు. దాంతో అది పేలిపోయింది. ఇక దాని ముక్కలు ఎక్కడ పడతాయో అనే టెన్షన్ మొదలైంది.

    సాధారణంగా రాకెట్ పేలినా... దాని శకలాలు... మనుషులు లేని చోటే పడేలా ఏర్పాటు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఆ శకలాలు మనుషులపై పడే అవకాశాలు చాలా తక్కువే అంటున్నారు. అదే నిజమైతే ఏ సమస్యా ఉండదు. అలా కాకుండా... ఆ శకలాలు... ఎటుబడితే అటు వెళ్లి...చివరకు ప్రజలు నివసించే చోట పడితే... ప్రాణాలకే ప్రమాదం.


    అది ఎక్కడ పడుతుందో ముందే చెప్పలేం అని ఎందుకు అంటున్నారంటే... భూమి వాతావరణం వల్లే. భూ వాతావరణం... సూర్యుడి కిరణాలతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. అందువల్ల చాలా అనిశ్చిత పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి... దాన్ని కంట్రోల్ చెయ్యడం తమ వల్ల కావట్లేదని చెబుతున్నారు. కనీసం అది ఎక్కడ పడుతుందో చెప్పినా... ప్రజలకు టెన్షన్ ఉండేది కాదు.


    ఈ పడిపోతున్న రాకెట్... ప్రతి 90 నిమిషాలకు ఓసారి భూమి చుట్టూ తిరుగుతోంది. అందువల్ల ఇది న్యూయార్క్ లేదా మాడ్రిడ్ లేదా బీజింగ్‌పై పడవచ్చనీ లేదంటే... చిలీ, వెల్లింగ్టన్, న్యూజిలాండ్‌పై పడే ప్రమాదం ఉందని మరికొందరు అంచనా వేస్తున్నారు.

    రాకెట్‌కి సంబంధించిన శకలాల్లో చిన్న చిన్న ముక్కలన్నీ గాలి ఒరిపిడి వల్ల కాలి బూడిద అవుతాయి. పెద్ద పెద్ద ముక్కలు మాత్రం భూమిపై పడతాయి అని స్టీడీ స్టేట్ ఓషన్ ఎక్స్‌ప్లోరర్ (GOCE) తెలిపింది. అందరూ అన్ని అంచనాలూ వేస్తున్నారు గానీ... కచ్చితంగా శకలాలు ఎక్కడ కూలుతాయో చెప్పలేకపోతున్నారు. ఐతే... ఇది స్కైలాబ్ అంత పెద్దది కాదు కాబట్టి... మరీ అంతగా భయపడాల్సిన పనిలేదు అంటున్నారు.

    ఇది కూడా చదవండి: India Covid 19: ఇండియాలో 2 కోట్లు దాటిన కరోనా కేసులు... కాస్త తగ్గిన వైరస్ జోరు

    ప్రస్తుతం చైనా స్పేస్ స్టేషన్... భూ కక్ష్యకు 352 X 385 కిలోమీటర్ల దగ్గర తిరుగుతోంది. ఇంకా పూర్తికాని ఈ కేంద్రాన్ని 2022 నాటికి పూర్తి చెయ్యాలని చైనా ప్రయత్నిస్తోంది. అలా జరగాలంటే... మరో పది సార్లు రాకెట్ ప్రయోగాలు చెయ్యాల్సి ఉంటుంది. ఆ రాకెట్లలో రకరకాల పరికరాల్ని చేరవేయాల్సి ఉంటుంది.
    Published by:Krishna Kumar N
    First published: