• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • CHINA MAN LEFT DANGLING FROM BRIDGE AFTER GLASS BREAKS MK GH

Glass Bridge: చైనాలో గాజు వంతెనపై నుంచి పడిన వ్యక్తి.. అతడికి ఏమైందంటే...

Glass Bridge: చైనాలో గాజు వంతెనపై నుంచి పడిన వ్యక్తి.. అతడికి ఏమైందంటే...

ప్రతీకాత్మకచిత్రం

కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదం అంచు వరకు వెళ్లే అవకాశముంటుంది. అదృష్టం కలిసి రావడంతో పాటు సందర్భానుసారం తెలి?

  • Share this:
కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదం అంచు వరకు వెళ్లే అవకాశముంటుంది. అదృష్టం కలిసి రావడంతో పాటు సందర్భానుసారం తెలివిగా వ్యవహరించడం వల్ల ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. తాజాగా చైనాకు చెందిన ఓ వ్యక్తి ఇలాంటి ప్రమాదం నుంచే బయటపడ్డాడు. అద్దాలతో నిర్మించిన వంతెన నుంచి వెళ్తుండగా.. గాలి వేగానికి గాజు ప్యానెళ్లు పగలడంతో కిందకు జారబోయాడు. వెంటనే పక్కన ఉన్న ఇనుప కమ్మెలను పట్టుకొని ప్రాణాలను కాపాడుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న పియాన్ పర్వతంపై అద్దాలతో నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. అందమైన దృశ్యాలను ఈ వంతెన ద్వారా పర్యాటకులు వీక్షిస్తారు. శుక్రవారం నాడు ఓ వ్యక్తి అక్కడకు వెళ్లాడు. అద్దాలపై నుంచి నడుస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు.

ఆ సమయంలో గాలులు వేగంగా వీయడంతో గ్లాస్ బ్రిడ్జ్‌పై ఉన్న అద్దాలు పగిలిపోయాయి. రెప్పపాటులో ప్రమాదాన్ని గుర్తించి వంతెనకు పక్కన ఉన్న ఇనుప కమ్మెలను పట్టుకొని వేలాడాడు. 100 మీటర్ల(330 అడుగులు) ఎత్తుండే ఈ హై బ్రిడ్జిపై ఆ సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీశాయి. ఈ గాలుల వేగానికి వంతెనకు అమర్చిన అద్దాలు కొన్ని పగిలిపోయాయి. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సురక్షితంగా బయటపడ్డాడు..
వెంటనే ఆ వ్యక్తిని రక్షించడానికి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి సహాయంతో క్షేమంగా బయటపడ్డాడు. అనంతరం అతడిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడి మానసిక స్థితి స్థిరంగా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని మూసివేసి విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. థ్రిల్ ను కోరుకునే పర్యాటకులను ఆకర్షించడానికి చైనాలో ఇలాంటి గాజు వంతెనలను ఎక్కువగా నిర్మిస్తున్నారు. మొత్తం ఆ దేశంలో ఇలాంటివి 2300 వంతెనలు ఉన్నాయి.

గతంలోనూ కొన్నిసార్లు..
చైనాలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటి సారి కాదు. ఫలితంగా 2018లో హెబీ ప్రావిన్స్ లో ఉన్న 32 గాజు వంతెనలు, బ్రిడ్జి మార్గాలను మూసివేశారు. అక్కడ భద్రతా తనిఖీలు కూడా జరిగాయి. దేశంలో మరెక్కడా గువాంగ్జీ ప్రావిన్స్ లో గ్లాస్ స్లైడ్ నుంచి పడిపోవడంతో 2019లో ఒకరు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. 2016లో జాంగ్జియాజీ నగరంలో ఓ వంతెన నడకమార్గంలో ఓ పర్యాటకుడు జారిపడి గాయపడ్డాడు.
Published by:Krishna Adithya
First published:

అగ్ర కథనాలు