CHINA HARVESTS SEEDS THAT TRAVELLED TO THE MOON AND BACK HERE IS INTERESTING DETAILS GH SK
Heaven Rice: అంతరిక్ష బియ్యం.. చంద్రుడి మీది నుంచి వచ్చిన విత్తనాలతో అక్కడ వరి సాగు
ప్రతీకాత్మక చిత్రం
భూమిపై నుంచి పంపిన విత్తనాలు కొంతకాలంపాటు అంతరిక్ష వాతావరణంలో ఉన్న తరువాత చాలా మార్పు చెందుతాయి. ఆ విత్తనాలను భూమిపైకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పంట పండిస్తే అధిక దిగుబడి ఇస్తాయి.
కరోనా మహమ్మారి చైనా సృష్టేనని ప్రపంచ దేశాలు ఏకిపారేస్తున్నా సరే.. చైనా మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. అంతరిక్షంలో వినూత్న ప్రయోగాలు చేస్తూ అమెరికా వంటి దేశాలకు సవాల్ విసురుతోంది. తాజాగా చైనా అంతరిక్షంలోకి పంపి, అక్కడి నుంచి తిరిగి తీసుకువచ్చిన విత్తనాలతో వరి పంట పండించి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. అంతేకాదు ఈ వరి పంటకు రైస్ స్పేస్ అని పేరు పెట్టింది. ఈ ప్రయోగాన్ని చైనా గతేడాది నవంబర్‌లో చేపట్టింది. అప్పుడు చాంగ్ 5 రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపింది. ఈ రాకెట్లో వరి విత్తనాలను కూడా పంపించింది. ఈ వడ్లు కాస్మిక్ రేడియేషన్‌తో పాటు సున్నా గురుత్వాకర్షణకు గురైన తరువాత, వాటిని తిరిగి భూమికి తీసుకొచ్చింది.
మొత్తం 40 గ్రాముల బరువున్న 1,500 వరి విత్తనాలను స్పేస్ క్రాఫ్ట్ భూమికి మోసుకువచ్చింది. వీటిని దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నాటారు. ఆ తర్వాత గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్పేస్ బ్రీడింగ్ రీసెర్చ్ సెంటర్లో వీటిపై పరిశోధన జరిపారు. స్పేస్ రైస్ ఒక్కో విత్తనం పొడవు 1 సెంటీమీటర్ ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. అధిక దిగుబడినిచ్చే ఈ విత్తనాలను ప్రయోగశాల్లో పెంచి, ఆపై పొలాల్లో పండిస్తామని పరిశోధనా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ గువో టావో పేర్కొన్నారు.
స్పేస్ రైస్ అంటే ఏంటి?
భూమిపై నుంచి పంపిన విత్తనాలు కొంతకాలంపాటు అంతరిక్ష వాతావరణంలో ఉన్న తరువాత చాలా మార్పు చెందుతాయి. ఆ విత్తనాలను భూమిపైకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పంట పండిస్తే అధిక దిగుబడి ఇస్తాయి. దాన్నే స్పేస్ రైస్‌గా పేర్కొంటారు. అయితే, చైనాకు ఇటువంటి ప్రయోగాలు కొత్తేమీ కాదు. ఆ దేశం 1987 నుంచి చంద్రుడిపైకి పత్తి, టమాటా వంటి పంటల విత్తనాలను పంపుతోంది. ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా చైనాలోనే ఉన్నందున అక్కడి భవిష్యత్తు ఆహార అవసరాలకు ఈ ‘స్పేస్ రైస్’ విధానం ఉపయోగపడుతుందని చైనా భావిస్తోంది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, చైనా ఇప్పటి వరకు 200 రకాలకు పైగా పంటల విత్తనాలను అంతరిక్షంలోకి పంపించింది. 2018లో ఆ విత్తనాల ద్వారా 2.4 మిలియన్ హెక్టార్లకు పైగా సాగు చేశారు. చైనా శాస్త్రవేత్తలు దీనిని హెవెన్ రైస్ (స్వర్గం నుంచి తెచ్చిన బియ్యం) అని కూడా పిలుస్తున్నారు. ఇటువంటి విత్తనాలు సుమారు 3 నుంచి 4 సంవత్సరాల తరువాత మార్కెట్లో లభిస్తాయని పేర్కొన్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.