సింహం పిల్లకు పాలు పట్టిన చింపాంజీ... నిజమైన ప్రేమ అంటున్న నెటిజన్లు

పాలు పట్టాక... ఆ చింపాంజీ ఆప్యాయంగా ముద్దుపెట్టుకోవడం అందరి మనసుల్నీ కదిలిస్తోంది.

news18-telugu
Updated: July 8, 2020, 2:56 PM IST
సింహం పిల్లకు పాలు పట్టిన చింపాంజీ... నిజమైన ప్రేమ అంటున్న నెటిజన్లు
సింహం పిల్లకు పాలు పట్టిన చింపాంజీ... నిజమైన ప్రేమ అంటున్న నెటిజన్లు (credit - twitter)
  • Share this:
ఇంటర్నెట్‌లో అప్పుడప్పుడూ మంచి మంచి వీడియోల్ని మనం చూస్తుంటాం. కొన్ని కొన్ని మన మనసుల్ని కదిలిస్తాయి. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకు హద్దులు ఉండవని అవి నిరూపిస్తాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెటిజన్ల మనసులు దోచుకుంటోంది. ఈ వీడియోలో... ఓ చింపాంజీ... సింహం పిల్లకు బాటిల్‌తో పాలు పట్టింది. ఎంతో జాగ్రత్తగా పాలను పట్టడమే కాదు... చివర్లో సింహం పిల్ల నుదుటిపై ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది. జాతి వైరాన్ని మరచి ప్రేమానురాగాల్ని పంచింది. అందుకే ఈ వీడియో ఇప్పుడు అందరికీ నచ్చేస్తోంది. ఒక్కొక్కరూ రెండు మూడు సార్లు దీన్ని చూస్తున్నారు.


ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నందా.. ఈ వీడియోని జులై 7న ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటికే దీన్ని 1.17 లక్షల మంది చూడగా... 8.5 వేల లైక్స్ వచ్చాయి. 1.6 వేల మంది రీట్వీట్ చేశారు. అదిరిపోయే కామెంట్స్ దీనికి వస్తున్నాయి. నా హృదయం కరిగింది అని ఓ నెటిజన్ కామెంట్ రాయగా... తల్లి ప్రేమకు పరిమితులు, హద్దులు, రంగు, జాతి విబేధాలు ఉండవని మరో యూజర్ స్వీట్ కామెంట్ పెట్టారు.






సుశాంత నందా ఇలాంటి వీడియోలను తరచూ నెటిజన్లకు చూపిస్తున్నారు. తద్వారా... జంతుజాలం, మూగజీవాలపై ప్రజల్లో అవగాహన పెరిగేలా చేస్తున్నారు. ప్రస్తుత వీడియో... ఓ జూలో తీసినట్లుగా కనిపిస్తోంది. ఇది ఎక్కడిది అనే అంశం కంటే... ఇందులో చింపాజీ చూపిన ప్రేమే అందర్నీ కట్టిపడేస్తోంది.
Published by: Krishna Kumar N
First published: July 8, 2020, 2:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading